ఫేక్ సర్టిఫికెట్లపై జీహెచ్ఎంసీ మేయర్ సీరియస్: కమిషనర్‌కు విజిలెన్స్ నివేదిక

ఫేక్ సర్టిఫికెట్లపై  జీహెచ్ఎంసీ  మేయర్  గద్వాల విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. ఈ విషయమై  విజిలెన్స్  నివేదిక కమిషనర్ కు  చేరింది. ఈ నివేదిక  ఆధారంగా  చర్యలు తీసుకోనున్నారు.

GHMC  Mayor  Gadwal  Vijaya Laxmi  fires  on Fake  certificates


హైదరాబాద్: :ఫేక్ సర్టిఫికెట్లపై  జీహెచ్ఎంసీ మేయర్  గద్వాల విజయలక్ష్మి  అధికారుల  సీరియస్ అయ్యారు.  ఈ సర్టిఫికెట్ల విషయమై  విజిలెన్స్ విచారణకు  కమిషనర్ ఆదేశించిన విషయం తెలిసిందే.  సుమారు  20 వేల  దొంగ సర్టిఫికెట్లు  వెలుగు చూడడంపై విజిలెన్స్  అధికారులు  విచారణ నిర్వహించారు.  విలిజెన్స్ అధికారులు  కమిషనర్ కు  నివేదిక అందించినట్టుగా  సమాచారం.  ఫేక్ సర్టిఫికెట్లలో  బర్త్, డెత్ సర్టిఫికెట్లున్నాయి.  

ఫేక్ సర్టిఫికెట్ల అంశంపై  జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి  అధికారులతో  సమీక్ష సమావేశం  ఏర్పాటు  చేశారు. ఫేక్ సర్టిఫికెట్లపై  సంబంధిత అధికారులను  మేయర్ తన చాంబర్ కు పిలిపించుకుని  ఆగ్రహం  వ్యక్తం  చేశారు.ఫేక్ సర్టిఫికెట్లు జారీ  విషయంలో  బాధ్యులైన  అధికారులపై  చర్యలు తీసుకోనున్నారు కమిషనర్.  విజిలెన్స్  రిపోర్టు  ఆధారంగా   ఇందుకు బాధ్యులైన వారిపై  జీహెచ్ఎంసీ కమిషనర్ చర్యలు తీసుకొనే అవకాశం ఉంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios