హైదరాబాద్: జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో రామ్మోహన్ పోటీ చేయలేదు.చర్లపల్లి డివిజన్ నుండి  బొంతు శ్రీదేవి టీఆర్ఎస్ అభ్యర్ధిగా శ్రీదేవి పోటీ చేసి విజయం సాధించారు.

గత ఎన్నికల్లో ఇదే డివిజన్ నుండి బొంతు రామ్మోహన్ పోటీ చేసి విజయం సాధించారు. మేయర్ అభ్యర్ధిగా రామ్మోహన్ పేరును టీఆర్ఎస్ ప్రకటించింది.ఈ దఫా మేయర్ పదవిని జనరల్ మహిళకు రిజర్వ్ చేశారు. చర్లపల్లి డివిజన్ నుండి బొంతు రామ్మోహన్  తన భార్యను ఈ దఫా బరిలోకి దింపారు.

బీజేపీ అభ్యర్ధి సరేందర్ గౌడ్ పై మేయర్ సతీమణి శ్రీదేవి విజయం సాధించారు. ఉప్పల్ ఎమ్మెల్యే సతీమణి స్వప్నరెడ్డి ఓటమి పాలు కావడం టీఆర్ఎస్ వర్గాల్లో  చర్చకు దారి తీసింది.

also read:ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి చుక్కెదురు: హబ్సిగూడలో భార్య స్వప్న ఓటమి

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగురవేస్తామని బీజేపీ ధీమాను వ్యక్తం చేసింది. కానీ ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా  ఆధిక్యాలు కన్పిస్తున్నాయి. టీఆర్ఎస్ మరోసారి జీహెచ్ఎంసీ పీఠాన్ని దక్కించుకొనే అవకాశం కన్పిస్తోంది.