హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన అక్రమ హోర్డింగ్‌లపై జీహెచ్ఎంసీ కొరడా ఝుళిపించింది. నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగ్స్ ఏర్పాటు చేసినందుకు గాను భారీ జరిమానా విధించింది.

దీనిలో భాగంగా అమీర్‌పేట చెన్నై షాపింగ్ మాల్‌కు రూ.4 లక్షలు, వీఆర్‌కే సిల్క్స్‌కు రెండు లక్షలు.. ఎస్ఆర్ నగర్‌లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్‌కు లక్షన్నర, రిలయన్స్ డిజిటల్‌కు లక్ష, లక్డీకాపూల్‌లోని ఇంపీరియల్ రెస్టారెంట్‌కు లక్ష జరిమానా విధించింది.

అక్రమంగా హోర్డింగ్‌లు, బ్యానర్లు ఏర్పాటు చేసిన  వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

దీనిలో భాగంగా గత కొద్దిరోజులుగా అక్రమ హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లపై జీహెచ్ఎంసీ అధికారులు భారీగా జరిమానాలు వేస్తున్న విషయం విదితమే.