హైదరాబాద్:  ప్రజా యుద్దనౌక గద్దర్ మంగళవారం నాడు ఓటుహక్కును వినియోగించుకొన్నారు. జీవితంలో రెండోసారి గద్దర్ తన ఓటును వినియోగించుకొన్నారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో  తొలిసారిగా తన ఓటుహక్కును వినియోగించుకొన్నారు. ఆ సమయంలో మహాకూటమి తరపున పోటీ చేసేందుకు గద్దర్ తనయుడు సూర్యం ప్రయత్నించాడు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా సూర్యం ఆ ఎన్నికల్లో పోటీకి ప్రయత్నించాడు. కానీ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సూర్యంకు టికెట్టు ఇవ్వలేదు.

also read:జీవితంలో మలుపు: తొలిసారిగా ఓటేసిన గద్దర్

ఒకప్పటి పీపుల్స్ వార్ (ప్రస్తుత మావోయిస్టు పార్టీలో గద్దర్ కీలకంగా పనిచేశారు. చాలా కాలం పాటు ఆయన  అజ్ఞాతంలో ఉన్నారు. 

 

2017లో ఆయన మావోయిస్టు పార్టీకి దూరమౌతున్నట్టుగా ఆయన ప్రకటించారు. బుల్లెట్ కంటే బ్యాలెట్ పవర్ పుల్ ఆయుధమని గద్దర్ మరోసారి నిరూపించాడు.ఎన్నికల బహిష్కరణకు గతంలో పీపుల్స్ వార్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ పిలుపు కారణంగా గద్దర్ ఓటు హక్కును కూడ నమోదు చేసుకోలేదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన ఓటు హక్కును నమోదు చేసుకొన్నారు.తాజాగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గద్దర్ తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు.మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని అల్వాల్ వెంకటాపురంలో గద్దర్ తన ఓటుహక్కును నమోదు చేసుకొన్నారు.