హైదరాబాద్: ప్రజా యుద్దనౌక గద్దర్ తన సతీమణితో కలిసి తొలిసారిగా శుక్రవారం నాడు  తన ఓటు హక్కును వినియోగించుకొన్నారు. బుల్లెట్ కంటే  బ్యాలెట్ పవర్‌పుల్ ఆయుధమని  గద్దర్ నిరూపించారు. 70 ఏళ్లలో తొలిసారిగా గద్దర్  ఓటేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

చాలా ఏళ్ల క్రితం బ్యాంకు ఉద్యోగంలో చేరడానికి ముందే  అప్పటి పీపుల్స్ వార్  ( ఇప్పటి మావోయిస్టు) పార్టీతో సంబంధాలు ఉండేవి. భువనగిరిలో ఉద్యోగం చేస్తూనే  గద్దర్ అజ్ఞాతంలోకి వెళ్లారు.

చాలా కాలం పీపుల్స్ వార్ పార్టీలో పనిచేశారు. ఆ తర్వాత ఆయన జనజీవన స్రవంతిలోకి వచ్చారు.  గత ఏడాదిలో మావోయిస్టు పార్టీకి దూరమౌతున్నట్టు ఆయన ప్రకటించారు.

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడ గద్దర్  ప్రయత్నించారు. ప్రజా కూటమి  తరపున గద్దర్ ప్రచారం నిర్వహించారు. ఈ దఫా ఓటు వేసేందుకు  గద్దర్ తమ ఓటు హక్కును నమోదు చేసుకొన్నారు. 

మల్కాజిగిరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని అల్వాల్ వెంకటాపురంలో గద్దర్ తన ఓటు హక్కును నమోదు చేసుకొన్నారు. తన భార్యతో కలిసి  గద్దర్ శుక్రవారం నాడు  గద్దర్  ఓటు హక్కును వినియోగించుకొన్నారు. గత ఏడాదిలోనే గద్దర్ తనయుడు సూర్యం కాంగ్రెస్ పార్టీలో చేరారు.

గద్దర్ తనయుడు ఈ దఫా  కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేశారు.కానీ  సీట్ల  సర్ధుబాటు కారణంగా సూర్యం కు సీటు దక్కలేదు.