Asianet News TeluguAsianet News Telugu

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రశాంత్‌కి చిత్రహింసలు: యువకుడు సూసైడ్, ఎస్ఐపై వేటు


భూపాలపల్లి జిల్లా ఘణపురంలో పోలీసులు పెట్టిన చిత్రహింసలు భరించలేక ప్రశాంత్ అనే వ్యక్తి గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకొన్నాడు.ఈ ఘటనపై ఎస్ఐ ఉదయ్ కిరణ్ ను విధుల నుండి తప్పించారు. అంతేకాదు ఆయనపై కేసు నమోదు చేశారు

Ghanapuram SI Uday Kiran Suspeded For Suicide Prashanth In jayashankar bhupalpally District
Author
Warangal, First Published Apr 24, 2022, 9:40 AM IST

 వరంగల్: భూపాలపల్లి జిల్లాలోని Ghanapuramలో పోలీసులు కొట్టిన దెబ్బలకు మనోవేదనకు గురైన ప్రశాంత్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో ఎస్ఐ ఉదయ్ కిరణ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడిని విధుల నుండి తప్పించారు.

Jayashankar Bhupalpally జిల్లాలోని ఘణపురానికి చెందిన Prashanth అనే యువకుడు Bike  ను కొనుగోలు చేశాడు. బైక్ కొనుగోలు కోసం Finance తీసుకొన్నాడు. అయితే బైక్ EMIచెల్లించలేదు ఫైనాన్షియర్ ప్రశాంత్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ విషయమై ఫైనాన్షియర్ తో ప్రశాంత్ అతని స్నేహితుడు Sravan లు గొడవకు దిగాడు. దీంతో ప్రశాంత్ ను పోలీసులు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారని బాధిత కుటుంబం ఆరోపిస్తుంది.

పోలీసుల చిత్రహింసలను తట్టుకోలేక Police station  ఎదుటే ప్రశాంత్ గడ్డి మందు తాగి Suicide Attempt చేశాడు. ఈ ఘటన ఈ నెల 10వ తేదీన జరిగింది. ఆత్మహత్యాయత్నం చేసిన ప్రశాంత్ ను కుటుంబ సభ్యులు Warangal  లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రశాంత్ శనివారం నాడు మరణించాడు. ప్రశాంత్ నుండి మరణ వాంగ్మూలం కూడా తీసుకొన్నారు.

ఎస్ఐ Uday Kiran వేధింపుల కారణంగానే ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా ప్రశాంత్ చెప్పాడు.డైయింగ్ డిక్లరేషన్ తర్వాత ప్రశాంత్ మరణించాడు. దీంతో ఎస్ఐ ఉదయ్ కిరణ్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొన్నారు. ఆయనపై కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఆయనను విధుల నుండి కూడా తప్పించారు. మరో వైపు ప్రశాంత్ కి ఫైనాన్స్ ఇచ్చిన వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios