గంజాయి మాఫియా లీడర్ బాబూ కాలేను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నగర శివార్లలో శనివారం పట్టుకున్నారు నార్కోటెక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు. ఏపీ నుంచి మహారాష్ట్ర, ఢిల్లీకి గంజాయి సరఫరా చేస్తున్న బాబూ కాలే నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.

గత కొన్ని సంవత్సరాలుగా అతనిని పట్టుకునేందుకు ఐదు రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు. అనూహ్య రీతిలో ఇవాళ హైదరాబాద్‌లో బాబు కాలే పట్టుబడ్డాడు. ఆంధ్రా నుంచి గంజాయిని తీసుకుని మహారాష్ట్ర, ఢిల్లీలకు సరఫరా చేస్తున్నాడు.