Asianet News TeluguAsianet News Telugu

మొదటిసారి విమానం ఎక్కిన గంగవ్వ.. వీడియో వైరల్...

మై విలేజ్ షో గంగవ్వ మరోసారి వార్తల్లో నిలిచింది. మొదటి సారి విమానం ఎక్కి హల్ చల్ చేసింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. 

Gangavva boarded the plane for the first time, Video goes viral - bsb
Author
First Published Mar 10, 2023, 2:13 PM IST

తెలంగాణ : తెలంగాణకు చెందిన యూట్యూబర్ బామ్మ గంగవ్వ తొలిసారి విమానం ఎక్కిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయబడింది. ఇప్పుడీ వీడియో వైరల్ గా మారింది. గంగవ్వ పేరు తెలియని యూ ట్యూబ్ తెలుగు ప్రేక్షకుడు ఉండడు. మై విలేజ్ షో అనే ప్రోగ్రాంతో అందరినీ అలరించింది గంగవ్వ. ఆ తరువాత అదే ఫేమ్ తో బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసి.. భేష్ అనిపించుకుంది. 

తెలంగాణలోని ఓ గ్రామానికి చెందిన గంగవ్వ తన చిత్రీకరించే వీడియోల ద్వారా పాపులర్ అయ్యింది. ఆమె అల్లుడు సృష్టించడం ప్రారంభించడంతో ఇంటర్నెట్ సంచలనంగా మారింది. అంతే కాదు బిగ్ బాస్ 4 తెలుగు రియాల్టీ షోలో పాల్గొనడంతో ఆమెకు పాపులారిటీ పెరిగింది. ఇప్పుడు, ఆమె మరో వీడియోతో  ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. ఈ వైరల్ వీడియో క్లిప్‌లో ఆమె తన జీవితంలో మొదటిసారిగా విమానంలో ప్రయాణించినట్లుగా చూపిస్తుంది.

ఏపీలో రెండో అతిపెద్ద ధనిక దేవాలయంగా శ్రీశైలం.. ఫలించిన 50యేళ్ల పోరాటం...

ఈ వీడియోను గంగవ్వ అఫీషియల్ ఇన్ స్టా పేజ్లో పోస్ట్ చేశారు. దీనికి విమానం ఎక్కిన... అని తెలుగులో రాసిన క్యాప్షన్‌తో పోస్ట్ చేసింది. "ఫ్లైట్ ఎక్కిన ఒక మహిళ #ఫస్ట్ ఫ్లైట్ #ఫస్ట్ టైం ఫ్లైట్ అనుభవం" అని అందులో రాశారు.

ఈ వీడియో గత నెలలో షేర్ చేసింది. పోస్ట్ చేసినప్పటి నుండి, ఇప్పటివరకు ఈ క్లిప్ ను ఆరు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో పాటు షేర్ లు, లైక్ ల సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. ఈ వీడియోపై ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు విభిన్నంగా స్పందించారు. 

ఒకరైతే.. “గ్రేట్ జాబ్ బ్రో. మీ భాష నాకు అర్థం కాలేదు. కానీ మీరు చాలా గొప్ప పని చేసారు. మా అమ్మను ఫ్లైట్‌లో తీసుకెళ్లే రోజు కోసం ఎదురు చూస్తున్నాను' అని ఇన్‌స్టాగ్రామ్ యూజర్ తెలిపారు. "కొన్నిసార్లు ఇలాంటి వాటికి భాష అక్కర్లేదు అర్థమైపోతుంది" అని మరొకరు అన్నారు. “బ్రో నాకు తెలుగు అర్థం కాదు కానీ ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఆమె మొహంలోని భావాలను గమనించగలను” అని మూడో వ్యక్తి కామెంట్ చేశాడు.

 ‘‘గంగవ్వ స్ఫూర్తి. విజయం ఏ వయసులోనైనా వస్తుంది... పని చేస్తూ ఉండండి. మీ కలలను సాకారం చేసుకునే దిశగా ప్రయత్నించండి” అని మరొకరు రాశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios