డేటా చోరీపై రంగంలోకి ఈడీ: మనీలాండరింగ్ పై కేసు

డేటా  చోరీపై  ఈడీ  కేసు నమోదు  చేసింది. సైబరాబాద్ పోలీసుల  నమోదు  ఆధారంగా  ఈడీ  అధికారులు   రంగంలోకి దిగారు.

Gang selling data of 16 crore Indians: ED takes up money laundering probe lns


హైదరాబాద్: డేటా  చోరీపై ఈడీ  కేసు నమోదు చేసింది.  మనీలాండరింగ్  నిరోధక చట్టం కింద  కేసును నమోదు చేశారు ఈడీ అధికారులు.  డేటా చోరీపై సైబరాబాద్ పోలీసులు నమోదు  చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా  ఈడీ  రంగంలోకి దిగింది.డేటా లీక్, హావాలా లావాదేవీలపై  ఈడీ కేంద్రీకరించింది.  డేటా లీక్ పై సమాచారం ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులకు  ఈడీ  లేఖ  రాసింది.   డేటా లీక్ పై  ఇప్పటికే కేంద్రం కూడా ఆరా తీస్తుంది.  ఆర్మీ, డిఫెన్స్ అధికారుల నుండి కూడా  కేంద్రం డేటా  చోరీపై  ఆరా తీస్తుంది. 

దేశంలోని  16.80 కోట్ల మంది  డేటాను  తొమ్మిది మంది సభ్యుల ముఠా  సేకరించిందని సైబరాబాద్  పోలీసులు గుర్తించారు.ఈ ముఠాను  సైబరాబాద్ పోలీసులు   అరెస్ట్  చేశారు.  దేశంలోని  పలు  రంగాల్లో  పనిచేస్తున్న వారికి సంబంధించి కీలక   సమాచారాన్ని  ఈ ముఠా సేకరించినట్టుగా  పోలీసులు గుర్తించారు.  ఆర్మీ, రక్షణ రంగాల్లో  పనిచేసే వారి సమాచారాన్ని కూడా  సేకరించారని  సైబరాబాద్ సీపీ  స్టీఫెన్ రవీంద్ర  ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించిన  వివరాలను  సైబరాబాద్ సీపీ  ఈ నెల  23న మీడియాకు వివరించారు. 

డేటా లీక్  కేసు విచారణను సిట్ కు అప్పగిస్తున్నట్టుగా సైబరాబా ద్ సీపీ  ప్రకటించారు. మరో వైపు ఈ కేసులో అరెస్టై న నిందితులను  సిట్ బృందం  కస్టడీలోకి తీసుకొని విచారిస్తుంది. డేటా లీక్, హావాలా లావాదేవీలపై  ఈడీ కేంద్రీకరించింది.  డేటా లీక్ పై సమాచారం ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులకు  ఈడీ  లేఖ  రాసింది.   డేటా లీక్ పై  ఇప్పటికే కేంద్రం కూడా ఆరా తీస్తుంది.  కీలకమైన బ్యాంకు ఖాతాదారుల  సమాచారం  కూడా  ఈ ముఠా సేకరించిందని  సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.  క్రెడిట్ కార్డులు జారీ  చేసే  ఏజెన్సీ ఉద్యోగి   నిందితుల్లో ఒకడిగా  ఉన్నట్టుగా  పోలీసులు తెలిపారు.  హైద్రాబాద్ నగరంలో  ఆరుగురిని ,ఉత్తర భారతంలో  మరో ముగ్గురిని  పోలీసులు అరెస్ట్  చేశారు. 

also read:డేటా లీక్ కేసులో ముగిసిన రెండో రోజు విచారణ : కాల్ సెంటర్లు, బ్యాంక్ సిబ్బంది పాత్రపై అనుమానాలు.. నోటీసులు

 దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున డేటా  చోరీ  జరగడం ఇదే ప్రథమంగా  సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు.    సేకరించిన డేటాలో  40 లక్షల మందికి చెందిన డేటాను  ఈ ముఠా సభ్యులు  విక్రయించారని  పోలీసులు గుర్తించారు.  ఈ  విషయమై సిట్ దర్యాప్తు  చేస్తుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios