యువతిపై ఆటోగ్యాంగ్ సామూహిక అత్యాచారం.. 9యేళ్ల తరువాత జైలుశిక్ష...
ఓ యువతి మీద ఆటోగ్యాంగ్ సామూహిక అత్యాచారం జరిపిన 9యేళ్ల తరువాత.. ఆ నలుగురు నిందితులకు శిక్ష ఖరారయ్యింది. జైలు శిక్షతో పాటు జరిమానా పడింది.
హైదరాబాద్ : శుక్రవారం నాడు హైదరాబాదులోని ఉప్పరపల్లి ఫోక్సోకోర్టు లైంగిక దాడి కేసులో నిందితులుగా ఉన్న నలుగురికి ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. 2014లో జరిగిన ఈ ఘటనలో 9 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఓ యువతి 2014 సెప్టెంబర్ 10వ తేదీన మియాపూర్ లో ఉంటున్న తన సోదరి ఇంటికి వచ్చింది. ఆ మరుసటి రోజు తన అక్క, బావలతో కలిసి సరదాగా శిల్పారామం వెళ్లారు.
ఆ తర్వాత శిల్పారామం నుంచి మియాపూర్ అంజయ్య కాలనీలోని ఇంటికి వెళ్లేందుకు రాత్రి అక్కడే ఉన్నవాహీద్ అనే వ్యక్తి నడుపుతున్న ఆటోను అద్దెకు మాట్లాడుకున్నారు వీరు ముగ్గురు. వారిని ఆటోలో ఎక్కించుకున్న వాహిద్ మార్గమధ్యలో తన స్నేహితులైన ముస్తఫా, షరీఫ్, నజీర్లను కూడా ఆటోలో ఎక్కించాడు. ఆ తర్వాత ఆటో అంజయ్య నగర్ కు వెళ్లాల్సిన మార్గంలో కాకుండా మరోవైపుకు మళ్ళించడంతో సదరు యువతి బావ వాహీద్ ను ఎటు వెళ్తున్నామంటూ ప్రశ్నించాడు.
మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్న ఈటెల, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...పార్టీ వీడడంపై క్లారిటీ!!
ఆటో డ్రైవర్ తో పాటు అతని స్నేహితులైన ముగ్గురు ఆ యువతి బావను కొట్టి.. అతడిని, ఆమె అక్కను ఆటోలో నుంచి కిందికి గెంటేశారు. తర్వాత యువతిని సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డారు. వారి నుంచి ఎలాగో తప్పించుకున్న బాధితురాలు ఆ తర్వాత రోడ్డుమీదికి వచ్చి స్థానికుల సహాయంతో.. తన అక్క, బావల దగ్గరికి చేరుకుంది.
అదే రోజు రాత్రి వారందరూ కలిసి వెళ్లి మియాపూర్ పోలీసులకు అత్యాచారం విషయం ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు.. నిందితులైన ఆటో డ్రైవర్ వాహిద్ తో పాటు అతని స్నేహితులు ముస్తఫా, షరీఫ్, నజీర్లను అరెస్టు చేశారు. వీరు ముగ్గురి మీద కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో సాక్షాదారాలను పరిశీలించిన ఉపరపల్లి ఫోక్సో కోర్టు నిందితులు నలుగురికి శుక్రవారం ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.