మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్న ఈటెల, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి...పార్టీ వీడడంపై క్లారిటీ!!
బీజేపీ అసంతృప్త నేతలు ఈటెల, కోమటిరెడ్డి ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి వెడుతున్నారు. పార్టీ అధ్యక్షుడు నడ్డాతో భేటీ కానున్నారు.
హైదరాబాద్ : శనివారం మధ్యాహ్నం బీజేపీ నేతలు ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ బీజేపీ అధ్యక్షుడునడ్డాతో భేటీ కానున్నారు. పార్టీలో ఇద్దరూ అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం బుజ్జగింపులకు దిగింది. ఈ బేటీ తర్వాత ఇద్దరి భవిష్యత్తు తేలనుండి. ఈరోజు పార్టీ అధ్యక్షుడు నడ్డాతో ఈటెల, కోమటిరెడ్డి సమావేశం నేపథ్యంలో మధ్యాహ్నం ఢిల్లీకి ఈటెల బయల్దేరుతున్నారు.
రాష్ట్ర నాయకత్వంపై ఈ ఇద్దరు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, పార్టీ మారతారని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో చేరి చాలాకాలం అవుతున్నా ఈటెల రాజేందర్ కు రాష్ట్రస్థాయి పదవి విషయంలో క్లారిటీ లేదు. ఈ విషయం కూడా చర్చకు రానుంది.
ఘర్ వాపసీ : సొంత గూటికి కోమటిరెడ్డి రాజగోపాల్.. కాంగ్రెస్ లో చేరిక దాదాపు ఖాయం... !!
మరోవైపు పార్టీ అధ్యక్షుడు నడ్డా రాష్ట్రానికి రాబోతున్నారు. అయినా, ఈ రోజు ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి ఢిల్లీకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఇక కొద్ది సేపటి క్రితమే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. దీంతో ఈ భేటీలో కిషన్ రెడ్డి కూడా ఉండబోతున్నారని సమాచారం.
రాష్ట్రంలో బీజేపీ తమను కలుపుకుని పోవడం లేదని, కార్యక్రమాలు అనుకున్న రీతిలో జరగడం లేదని ఈ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.