గణేష్ విగ్రహాల నిమజ్జనానికి కరోనా దెబ్బ: ప్రారంభమైన శోభాయాత్ర
హైదద్రాబాద్ పట్టణంలో మంగళవారం నాడు గణేష్ విగ్రహల నిమజ్జన శోభాయత్ర ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అతి తక్కువ సంఖ్యలో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు.
హైదరాబాద్: హైదద్రాబాద్ పట్టణంలో మంగళవారం నాడు గణేష్ విగ్రహల నిమజ్జన శోభాయత్ర ప్రారంభమైంది. కరోనా నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అతి తక్కువ సంఖ్యలో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు.
కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది హైద్రాబాద్ నగరంలో అతి తక్కువ సంఖ్యలో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ప్రఖ్యాతి చెందిన ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఎత్తును 9 అడగులకే పరిమితం చేశారు. గత ఏడాది 65 అడుగుల ఎత్తులో విగ్రహం ఉంది.
ఈ ఏడాది ఖైరతాబాద్ గణేషుడి విగ్రహం వద్ద భక్తులకు ఆన్ లైన్ లో దర్శనం కల్పించారు. ఖైరతాబాద్ వద్దకు భక్తులను అనుమతించలేదు.మంగళవారం నాడు ఉదయం ప్రత్యేక పూజలను నిర్వహించిన తర్వాత నిమజ్జనం కొరకు ప్రత్యేక క్రేన్ లో విగ్రహన్ని హుస్సేన్ సాగర్ కు తరలించనున్నారు.
ఇక బాలాపూర్ గణేష్ వినాయక విగ్రహం శోభాయాత్ర ప్రారంభమైంది. ఇవాళ సాయంత్రానికి బాలాపూర్ గణేష్ విగ్రహం ట్యాంక్ బండ్ వద్దకు చేరుకొనే అవకాశం ఉంది.బాలాపూర్ గణేష్ లడ్డు వేలం పాటను కరోనా కారణంగా రద్దు చేశారు. లడ్డును సీఎం కేసీఆర్ కు అందించనున్నట్టుగా ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.
also read:కరోనా ఎఫెక్ట్: తెలంగాణలో గణేష్ ఉత్సవ మండపాల అనుమతికి నో
గతంలో ట్యాంక్ బండ్ చుట్టూ సుమారు 50 క్రేన్ ల సహాయంతో గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగేది. ఈ ఏడాది కేవలం 7 క్రేన్ లను మాత్రమే ఏర్పాటు చేశారు.
ట్యాంక్ బండ్ క్రేన్ 4 ద్వారా ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేయనున్నారు.
సాధారణంగా హైద్రాబాద్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం కనీసం రెండు రోజుల పాటు జరిగేది. కరోనాను పురస్కరించుకొని ఈ ఏడాది గత ఏడాదితో పోలిస్తే నామమాత్రంగానే గణేష్ వినాయక విగ్రహాల నిమజ్జనం సాగుతోంది.