హైదరాబాద్: హైద్రాబాద్‌ నగరంలోని వనస్థలిపురంలో గగన్ అగర్వాల్  అనే వ్యక్తి  మృతదేహాన్ని ఆయన ఇంట్లో నుండే పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

గత నెల 8వ తేదీ నుండి అగర్వాల్ కన్పించకుండా పోయాడు. అగర్వాల్ ఆచూకీని కనిపెట్టాలని కుటుంబసభ్యులు  పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గగన్ అగర్వాల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కానీ ఆయన ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు.

అగర్వాల్ మృతదేహం ఆయన ఇంట్లోనే పూడ్చి పెట్టినట్టుగా పోలీసులు గుర్తించారు.పూడ్చిపెట్టిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ మృతదేహాన్ని వెలికితీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.మృతుడి భార్యపైనే కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగానే  అగర్వాల్ హత్య జరిగిందనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

మొదటి భార్యకు విడాకులిచ్చి అగర్వాల్ రెండేళ్ల క్రితం నౌసిన్ బేగాన్ని వివాహం చేసుకొన్నారు. భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది.దీంతో అదే కోపంతో ఆమె భర్తను చంపినట్టుగా ప్రాథమికంగా గుర్తించారు.

శవాన్ని మాయం చేసేందుకు ఇంట్లోనే అగర్వాల్ మృతదేహాన్ని పూడ్చిపెట్టింది.ఈ విషయమై నిందితురాలి నుండి పోలీసులు కేసు వివరాలు సేకరిస్తున్నారు.