కోమటిరెడ్డి దుస్థితి: కాంగ్రెసు పొమ్మంటోంది, బిజెపి రమ్మనడం లేదు

First Published 18, Jul 2019, 3:27 PM

బీజేపీలో చేరే విషయంలో వేచి చూసే ధోరణిని అవలంభించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నట్టుగా కన్పిస్తోంది. తాను ఇంకా కాంగ్రెస్ పార్టీ సభ్యుడినేనని చెప్పారు. బీజేపీలో చేరాలని తనను ఎవరూ ఆహ్వానించలేదన్నారు.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు కన్సిస్తోంది. తన అనుచరులతో రాజగోపాల్ రెడ్డి ఫోన్ సంభాషణలను బీజేపీ నేతలు కొందరు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టుగా చెబుతున్నారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్‌లు రాజగోపాల్ రెడ్డి చేరిక విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే ప్రచారం ఉంది. బీజేపీలో చేరిక విషయమై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అగ్రనేతలతో చర్చించారని సమాచారం.

గురువారం నాడు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఈ నిరసన కార్యక్రమానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారు.

మల్లు భట్టి విక్రమార్క, సీతక్క , శ్రీధర్ బాబు ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. తమ పార్టీకి చెందిన శాసనసభ్యులు నిరసన తెలుపుతున్న సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ నిరసనకు దూరంగా ఉన్నారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగానే ఉందని నాయకత్వలోపం వల్లే నష్టం జరుగుతోందని కోమటిరెడ్ది రాజగోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తాను ఇంకా కాంగ్రెస్ పార్టీ సభ్యుడినేనని ఆయన ప్రకటించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని రాజగోపాల్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

బీజేపీలో చేరే విషయమై ఆసక్తికర వ్యాఖ్యలను చేశాడు. తనను బీజేపీలో చేరాలని ఎవరూ కూడ కోరలేదన్నారు. తాను బీజేపీలో చేరాలని అనుకోవడం లేదని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.

బీజేపీలో చేరే అవకాశం విషయమై దారులు మూసుకుపోయే పరిస్థితులు నెలకొన్నందునే రాజగోపాల్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారా... లేదా ఇంకా మరేదైనా కారణం ఉందా అనే విషయమై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

బీజేపీలో చేరే విషయమై సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకొంటానని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరే విషయమై గ్రీన్ సిగ్నల్ రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు కూడ రాజగోపాల్ రెడ్డి సమాధానం ఇచ్చారు.

రాజగోపాల్ రెడ్డిపై వేటు పడితే బీజేపీలో చేరినా ఆయన పదవిని కోల్పోయే అవకాశం ఉండదు. ఈ కారణంగానే రాజగోపాల్ రెడ్డిపై చర్య తీసుకొనే విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వెనుకాడుతున్నట్టుగా కన్పిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తొందరపడి రాజీనామాలు చేయవద్దని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీజేపీ నాయకత్వం సూచించినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే రాజగోపాల్ రెడ్డి వేచి చూసే ధోరణితో ఉన్నారని ఆయన సన్నిహితులు అంటున్నారు.

loader