Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణకు జ‌ల క‌ళ‌

తెలంగాణ నదులకు భారీగా వర్షపు నీరు.

గేట్లు ఎత్తెస్తున్న అధికారులు.

కోనసాగుతున్న వర్షపు నీరు.

full rain water in telangana projects

తెలుగు రాష్టాల‌లో మూడు రోజుల‌ కురుస్తున్న వ‌ర్షాల‌తో తెలంగాణ వ్యాప్తంగా చెరువుల‌కు న‌దుల‌కు భారీగా వ‌ర్ష‌పు నీరు చేరింది. తెలంగాణలోని దాదాపుగా అన్ని జిల్లాల‌లో ఒక మోస్తారు నుండి భారీ వ‌ర్షం ప‌డింది.  ముఖ్యంగా గోదావ‌రి, కృష్ణ న‌దుల‌కు జ‌ల క‌ళ వ‌చ్చింది. తెలంగాణలో ఉన్న తాలిపేరు, వాజేడు, జూరాల ప్రాజేక్ట్‌కు భారీ నీరు వ‌చ్చి చేరింది. మూడు రోజులుగా కురుస్తున్న ఎడ‌తెరిపిలేని వ‌ర్షాల కార‌ణంగా వ‌ర్ష‌పు నీరు చేరింది.

జూరాల‌లో గ‌తంలో క‌న్న ఏకంగా 6 మీట‌ర్లు పైకి చేరింది. వాడేజు మండ‌లం పూజురు వ‌ద్ద‌ 12 మీట‌ర్ల‌కు నీరు చేరుకుంది.  భ‌ద్ర‌చ‌లం 23 మీట‌ర్ల పైకి చేరింది. భ‌ద్రాద్రి లో తాలిపేరు ప్రాజేక్ట్ వ‌ద్ద వ‌ర్ష‌పు ఎక్కువై 16 గేట్లు ఎత్తివేశారు. వ‌ర్షాకాలం పూర్తి స్థాయిలో ప్రారంభం కాకముందే తెలంగాణ ప్రాజేక్టుల‌కు నీరు చేర‌డం ఈ యోడాది రైతులు పంట పండినట్లే. 


మ‌రో రెండు రోజుల పాటు వ‌ర్షాలు తెలంగాణలో ఒక మోస్తారు నుండి భారీగానే ప‌డ‌నుంది.

Follow Us:
Download App:
  • android
  • ios