Asianet News TeluguAsianet News Telugu

చార్మినార్ దగ్గర సండే ఫండే.. నేటి నుంచి ప్రతి ఆదివారం.. ట్రాఫిక్‌పై ఆంక్షలు

నగరవాసులకు మరో తీపి కబురు. ఈ రోజు నుంచి ప్రతి ఆదివారం చార్మినార్ దగ్గర కుటుంబ సమేతంగా ఆహ్లాదంగా సమయాన్ని గడపడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్‌పై నిర్వహిస్తున్న సండే ఫండే ప్రోగ్రామ్ తరహాలోనే చార్మినార్ దగ్గర ‘ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’ పేరిట నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
 

from today onwards sunday funday at charminar
Author
Hyderabad, First Published Oct 17, 2021, 12:30 PM IST

ఉద్యోగ, వ్యక్తిగత గందరగోళం, గజిబిజీల నుంచి కాస్త ఊపిరి పీల్చుకోవడానికి సాయంత్రాల్లో బయటికి వెళ్లి రావాలని అందరూ తహతహలాడతారు. వారంలో ఒక్కరోజైనా ఆహ్లాదంగా గడపాలని ప్రతి నగరవాసుడు అనుకుంటాడు. ఇందుకు అనుగుణంగానే అధికారులు Tank bundపై ప్రతి ఆదివారం Sunday-Funday పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీటికి నగరవాసుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఆదివారం సాయంత్రం ట్యాంక్ బండ్‌పైకి వెళ్లి అక్కడ ఏర్పాటు చేస్తున్న ఫుడ్, ఇతర స్టాల్స్‌ను తిరుగుతున్నారు. స్నాక్స్ తింటూ షాపింగ్ చేస్తూ ఆహ్లాదంగా ఆదివారం సాయంత్రాన్ని గడుపుతున్నారు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడంతో ఇలాంటి కార్యక్రమాలనే సిటీ ఐకాన్ Charminar దగ్గర కూడా నిర్వహించాలనే విన్నపాలు వచ్చాయి.

దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించారు. Hyderabadలో పాతబస్తీలోని చార్మినార్ దగ్గరా ట్యాంక్ బండ్‌పై నిర్వహించినట్టుగానే సండే ఫండే ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం ఇవాళ్టి నుంచే ప్రారంభమవుతున్నది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

ఇక నుంచి ప్రతి ఆదివారం చార్మినార్ దగ్గర కూడా సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు సండే ఫండే కార్యక్రమం జరగనుంది. ‘ఏక్ షామ్ చార్మినార్ కే నామ్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 6.30 గంటలకు పోలీస్ బ్యాండ్‌తో ప్రోగ్రామ్ ప్రారంభం కానున్నట్టు సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. అర్ధరాత్రి వరకూ లాడ్ బజార్ అందుబాటులో ఉంటుంది.

Also Read: వచ్చే ఏడాది నుంచి ఆఫీసులకు వెళ్లాల్సిందే..!

ఈ ప్రోగ్రామ్‌లో పలు వస్తువులు, ఆహార పదార్థాలను అమ్మే స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలు, పెద్దలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఎంజాయ్ చేయవచ్చు. 

చార్మినార్ దగ్గర నిత్యం రద్దీ ఉంటుంది. పర్యాటకులు, వ్యాపారులు, వాహనాలతో కిక్కిరిసి ఉంటుంది. కానీ, ఈ కార్యక్రమం కోసం పోలీసులు trafficపై ఆంక్షలు విధించారు. ఈ రోజు చార్మినార్ ప్రాంతంలో వాహనాలను అనుమతించడం లేదు. అంతేకాదు, సండే ఫండే  కార్యక్రమంలో ఎంజాయ్ చేయడానికి వచ్చేవారు తమ వాహనాలను పార్కింగ్ చేసుకోవడానికి నాలుగు ప్రదేశాల్లో పార్కింగ్ సదుపాయాలు అధికారులు ఏర్పాటు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios