హైదరాబాద్ లో మరో విషాదం.. క్వారీ గుంతలో పడి నాలుగేళ్ల చిన్నారిమృతి... ఈతకు వెళ్లి విషాదం..

కనిపించకుండా పోయిన నాలుగేళ్ల చిన్నారి మనోజ్ మృతదేహంగా దొరికాడు. క్వారీ గుంతలో శవమై తేలాడు. ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. 

Four-year-old child dies after falling into quarry pit in Hyderabad - bsb

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. జగద్గిరి గుట్ట లెనిన్ నగర్ లో రెండు రోజుల క్రితం అదృశ్యమైన నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. కుక్కలు తరమడంతోనే.. వాటినుంచి తప్పించుకోవడానికి.. పరిగెత్తి క్వారీ గుంతలో పడి మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని చిన్నారి స్నేహితులు కూడా చెప్పారు. 

కనిపించకుండా పోయిన మనోజ్ అనే చిన్నారి కోసం గాలింపు చేపట్టగా అతని మృతదేహం క్వారీ గుంతలో దొరికింది. దీనిమీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చిన్నారి స్నేహితులతో కలిసి క్వారీ గుంతలో ఈతకు వెళ్లాడని పోలీసులు తేల్చారు.

ఈతకు వెళ్లిన తరువాత లోతైన ప్రాంతానికి వెళ్లడంతో.. మనోజ్ మునిగి చనిపోయినట్లు తేలింది. కాగా, ఈతకు వెళ్లామని చెబితే తలిదండ్రులు కోప్పడతారని భయపడి.. అతని స్నేహితులు కుక్కలు తరిమాయని అబద్దం చెప్పినట్టుగా తేలింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios