Hyderabad: హైదరాబాద్‌లో ఘరానా చోరీ.. ఐటీ అధికారులుగా నమ్మించి నగల షాపు నుంచి 2 కిలోల బంగారం ఎత్తుకెళ్లిన వైనం

హైదరాబాద్‌లో ఘరానా చోరీ జరిగింది. ఐటీ అధికారులుగా నమ్మించి నలుగురు దొంగలు నగల షాపులోకి వెళ్లి సుమారు 2 కిలోల బంగారాన్ని సీజ్ చేస్తున్నామని చెప్పారు. మళ్లీ వస్తామని చెప్పి ఆ రెండు కిలోల బంగారాన్ని వెంట తీసుకెళ్లారు.
 

four thives posing as IT officials looted 2 kg of gold from jewellery shop in hyderabad kms

Robbery: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఘరానా చోరీ చోటుచేసుకుంది. నలుగురు గజ దొంగలు ఆదాయ పన్ను శాఖ అధికారులుగా అవతారమెత్తారు. సికింద్రాబాద్‌లోని ఓ జువెలరీ షాప్‌లోకి వెళ్లారు. ఆ షాప్ సిబ్బంది, యాజమాన్యాన్ని నమ్మించారు. 2 కిలోల బంగారాన్ని సీజ్ చేస్తున్నామని.. వెంట ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత తాము మోసపోయామని గ్రహించిన షాప్ యజమానులు పోలీసు స్టేషన్‌కు పరుగు పెట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దొంగలను గాలించే పనిలో పడ్డారు. ఈ ఘటన సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో శనివారం చోటుచేసుకుంది.

పోలీసులు అందించిన వివరాల ప్రకారం, నలుగురు దొంగలు ఐటీ శాఖ అధికారులుగా నమ్మించారు. మోండా మార్కెట్‌లోని హర్ష్ గోల్డ్ స్టోర్‌కు వెళ్లారు. ఐటీ శాఖ అధికారులుగా కలర్ ఇస్తూ.. షాపులోని బంగారం ఎక్కడి నుంచి తెచ్చారో సోర్స్ ఇన్ఫర్మేషన్, అందుకు సంబంధించిన డాక్యుమెంట్లను చూపించాలని ఆదేశించారు. ఐటీ అధికారుల్లాగే ఆ పేపర్‌లను తీక్షణంగా చూస్తూ ఏదో పరిశీలిస్తున్నట్టు నటించారు.

‘నలుగురు వ్యక్తులు డాక్యుమెంట్లను పరిశీలించి పేపర్లు సరిగా లేవని అన్నారు. స్టోర్ నుంచి సుమారు నాలుగు కిలోల బంగారాన్ని సీజ్ చేస్తున్నట్టు చెప్పారు. మళ్లీ వచ్చి కలుస్తామని చెప్పి షాప్ విడిచి వెళ్లారు’ అని మోండా మార్కెట్ పోలీసులు వివరించారు.

Also Read: గోవా బీచ్‌లో తెలంగాణ వ్యక్తి రచ్చ.. మోర్జిమ్ బీచ్‌లో ర్యాష్ డ్రైవింగ్.. అరెస్టు చేసిన గోవా పోలీసులు

అయితే, ఆ షాప్ మేనేజ్‌మెంట్ తర్వాత కొందరిని అడిగి తెలుసుకుని మోసపోయామని గ్రహించారు. మోండా మార్కెట్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు పెట్టారు. ఆ దొంగలను పట్టుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios