గోవా బీచ్‌లో తెలంగాణ వ్యక్తి రచ్చ.. మోర్జిమ్ బీచ్‌లో ర్యాష్ డ్రైవింగ్.. అరెస్టు చేసిన గోవా పోలీసులు
గోవా బీచ్‌లో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి రచ్చ రచ్చ చేశాడు. నిబంధనలు ఉల్లంఘిస్తూ కారును బీచ్‌లోకి తీసుకెళ్లాడు. ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

పనాజీ: తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి గోవాకు టూర్ వెళ్లాడు. అక్కడ బీచ్‌లో తెగ ఎంజాయ్ చేశాడు. ఆ ఎంజాయ్‌మెంట్‌ను రెట్టింపు చేస్తూ బీచ్‌లోకి కారును తీసుకెళ్లాడు. మోర్జిమ్ బీచ్‌లో కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేశాడు. దీంతో అక్కడ ఉన్న ఇతర పర్యాటకుల ప్రాణాలను ప్రమాదంలో పడేశాడు. మోర్జిమ్ బీచ్‌లో సాధారణంగా తాబేళ్లు గుడ్లను పొదుగుతాయి కూడా.
సియోలిమ్ కోస్టల్ సెక్యూరిటీ పోలీసు స్టేషన్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. పెట్రోలింగ్ టీమ్ శుక్రవారం ఉదయం ఓ వ్యక్తిని పట్టుకుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో రిజిస్టర్ అయిన హోండా సిటీ కారును ర్యాష్ డ్రైవ్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని వివరించారు. ఆ ర్యాష్ డ్రైవింగ్‌తో అక్కడే ఉన్న ఇతర పర్యాటకులకు ప్రాణ సంకటంగా మారింది. ఈ మోర్జిమ్ బీచ్ తాబేళ్లు గుడ్లపై పొదిగే ఏరియా కాబట్టి.. సాధారణంగా కొన్ని ఆంక్షలు ఎక్కువ. అలాంటి బీచ్‌లో ఆ వ్యక్తి ఇష్టారీతిన కారు నడిపాడని అధికారులు వివరించారు.
ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పెర్నెమ్ పోలీసులకు అప్పగించామని, వారు అతనిపై కేసు నమోదు చేశారని సియోలిమ్ కోస్టల్ సెక్యూరిటీ పోలీసులు తెలిపారు.
నిందితుడిని అరెస్టు చేశామని, ఆ తర్వాత బెయిల్ పై విడిచి పెట్టామని పెర్నెమ్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సచిన్ లోక్రె వివరించారు.
నిందితుడిని తెలంగాణకు చెందిన సన్యాస్ యాదవ్‌గా గుర్తించినట్టు తెలిపారు.
గోవా టూరిజం డిపార్ట్‌మెంట్ అడ్వైజరీ ప్రకారం, బీచ్‌లలో టూ వీలర్లు సహా ఇతర మోటార్ వాహనాలను నడపడం నిషేధం. ఈ నిబంధన ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఆ వాహనాన్ని సీజ్ చేసి డ్రైవర్‌ను అరెస్టు కూడా చేయవచ్చు.