రంగారెడ్డి జిల్లా కుర్మల్ గూడ చెరువులో ఓ కుటుంబం దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆర్ధిక ఇబ్బందులతోనే ఈ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను  కుద్దుస్ పాషా, ఫాతిమా,మహేక్ బేగం, పిర్దోషి బేగం లుగా గుర్తించారు.

హైదరాబాద్: Ranga Reddy జిల్లా కుర్మల్ గూడ చెరువులో దూకి ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడినట్టుగా స్థానికులు చెబుతున్నారు. హైద్రాబాద్ మలక్‌పేటకు చెందిన ఈ కుటుంబం తొలుత పురుగుల మందు తాగి ఆ తర్వాత చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. 

మృతులను kuddus pasha, ఫాతిమా,మహేక్ బేగం, పిర్దోషి బేగం లుగా గుర్తించారు. భార్యాభర్తలు తమ ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెరువులో నుండి మృతదేహాలను వెలికి తీసి కుటుంబ సభ్యులకు అందించారు పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.