నిజామాబాద్: నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రిలో కరోనా సోకిన రోగులు నలుగురు మరణించడంతో బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వాసుపత్రిని జిల్లా కలెక్టర్ శుక్రవారం నాడు నారాయణ రెడ్డి సందర్శించారు. కరోనా రోగుల మరణంపై ఆయన వివరాలు సేకరిస్తున్నారు.

గత రెండున్నర నెలల కాలంలో ఈ ఆసుపత్రిలో సుమారు 10 మంది కరోనా రోగులు మరణించారు. కానీ 24 గంటల వ్యవధిలో నలుగురు కరోనా రోగులు మరణించడంతో కలకలం రేగింది.

also read:కర్నూల్‌ జిల్లాలో కరోనా భయంతో వ్యక్తి ఆత్మహత్య

మరణించిన నలుగురిలో ఇద్దరు కరోనా రోగులు ఆక్సిజన్ అందక మరణించారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే వీరిద్దరూ మరణించారని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఫ్యామిలీ మెంబర్లు ఆందోళనకు దిగారు.

దీంతో జిల్లా కేంద్ర ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.  ఆసుపత్రికి కిలోమీటరు దూరం వరకు రాకపోకలను నిషేధించారు. ఈ నలుగురు మరణించడం వెనుక డాక్టర్ల నిర్లక్ష్యం ఉందా లేదా అనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.