కాళ్లూ చేతులు కట్టేసి పొదల్లో పడేశారు: పోలీసుల పనే

కాళ్లూ చేతులు కట్టేసి పొదల్లో పడేశారు: పోలీసుల పనే

హైదరాబాద్: ఓ వ్యక్తి మృతికి సంబంధించిన కేసులో నలుగురు మీర్ పేట పోలీసు అధికారులపై వేటు పడింది.  తాళ్లతో కట్టేసి, హైరాబాదు నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో పొదల్లో వ్యక్తిని పడేశారు. ఏప్రిల్ 21వ తేదీన జరిగిన ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్ిచంది. 

అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న గుర్తు తెలియని వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే, అతను మరణించాడు. ఈ సంఘటనలో నలుగులు పోలీసు అధికారుల పాత్ర ఉన్నట్లు తెలిసిందే. 

ఈ సంఘటనలో ఓ సబ్ ఇన్ స్పెక్టర్, డిటెక్టివ్ సబ్ ఇన్ స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్, హెడ్ కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు రాచకొండ కమిషన్ మహేష్ భగవత్ ధ్రువీకరించారు. 

ఏప్రిల్ 21వ తేదీన సంఘీ టెంపుల్ ఆలయం సమీపంలోని అటవీ ప్రాంతంలో అతి వేగంగా వచ్చిన కారు అకస్మాత్తుగా ఆగిన విషయాన్ని రంగయ్య అనే గొర్రెలకాపరి గుర్తించాడు. కారులోని వారు ఓ వ్యక్తిని పొదల్లో పడేశారు. గొర్రెల కాపరి వారిని చూసి అప్రమత్తం చేసే లోగానే వారు కారు ఎక్కి పారిపోయారు. 

రంగయ్య సమాచారం ఇవ్వడంతో స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అతన్ని ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందతూ అతను మరణించాడు. సంఘటనపై దర్యాప్తు ప్రారంభించడంతో కారులో వచ్చినవారు సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులని తేలింది.  

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Telangana

Next page