ఉమ్మది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిమ్స్ డైరెక్టర్‌ గా పని చేసిన డాక్టర్ కాకర్ల సుబ్బారావు శుక్రవారం నాడు ఉదయం  మృతి చెందారు. నెల రోజులుగా ఆయన అనారోగ్యంతో  కిమ్స్ ఆసుపత్రిలో చేరారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూసినట్టుగా   కుటుంబసబ్యులు చెప్పారు.

Scroll to load tweet…

1925 లో కృష్ణా జిల్లా పెదముత్తేవిలో ఆయన జన్మించారు. చల్లపల్లిలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. మచిలీపట్నం హిందూ కాలేజీలో సాగింది.విశాఖపట్టణంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఆయన వైద్య విద్య పట్టా పొందారు. ఆ తర్వాత అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. అమెరికాలో ఉన్నత విద్య కోసం ఆయనకు ప్రత్యేక పారితోషికం లభించింది. 

1955లో అమెరికాలో రేడియాలజీ బోర్డు పరీక్షల్లో 1955లో ఉత్తీర్ణులయ్యారు. న్యూయార్క్, బాల్టీమోర్ నగరాల్లోని ఆసుపత్రుల్లో 1954 నుండి 1956 వరకు ఆయన పనిచేశారు. 1956లో ఇండియాకు తిరిగి వచ్చారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆ తర్వాత ఉస్మానియా కాలేజీలోనే ప్రధాన రేడియాలజిస్టుగా ప్రమోషన్ పొందారు. 

ఆంధ్రవిశ్వవిద్యాలయం నుండి ఆయన వైద్య పట్టా అందుకొన్నారు. ఆ తర్వాత ఆయన ఉస్మానియా ఆసుపత్రిలో రేడియాలజిస్టుగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిమ్స్ ఆసుపత్రిని కార్పో,రేట్ ఆసుపత్రులకు ధీటుగా తీర్చిదిద్దడంలో కాకర్ల సుబ్బారావు విశేష కృషి చేశారు. వైద్య రంగంలో కాకర్ల సుబ్బారావు చేసిన సేవలకు గాను ఆయనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చి ప్రభుత్వం సత్కరించింది. ఎన్టీఆర్ కు వ్యక్తిగత వైద్యుడిగా కూడ ఆయన పనిచేశారు.