హైదరాబాద్: మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత కవిత గురువారం నాడు ఉదయం నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో  ఆమె కోర్టు ముందు  హాజరయ్యారు.

2010లో జరిగిన  ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని కవితతో పాటు పలువురిపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో భాగంగా ఆమె ఇవాళ నాంపల్లి కోర్టు ముందు హాజరయ్యారు.

Also read:అనుచరులకు పట్టం : డీసీసీబీల్లో పట్టు కోసం చక్రం తిప్పుతున్న మంత్రులు

ఇదే కేసులో ఏ-3 గా ఉన్న  బీజేపీ నేత ఝాన్సీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో ఝాన్సీ మరణించిన విషయాన్ని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.ఇక ఇదే కేసులో  ఏ-2, ఏ-4 గా ఉన్న వారు  కోర్టుకు హాజరు కాలేదు. దీంతో  కోర్టు కేసును వచ్చే నెల 19వ తేదీకి వాయిదా వేసింది..