గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ  సమావేశం సోమవారం నాడు రసాభాసగా మారింది.  సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి తాను పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు మాజీ క్రికెటర్  అజారుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అనుచరులు  ఆగ్రహం  వ్యక్తం చేశారు. 

హైదరాబాద్: గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం సోమవారం నాడు రసాభాసగా మారింది. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి తాను పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్టు మాజీ క్రికెటర్ అజారుద్దీన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అజారుద్దీన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అంజన్ కుమార్ అనుచరులకు సర్దిచెప్పారు.

2019 ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి తాను పోటీ చేస్తానని మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ప్రకటించారు. సోమవారం నాడు జరిగిన గ్రేటర్ హైద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో అంజన్ కుమార్ యాదవ్ అనుచరులు అజారుద్దీన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంజన్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేస్తారని నినాదాలు చేశారు.

అజారుద్దీన్ ‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంజన్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో సమావేశంలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి జోక్యం చేసుకొన్నారు. అయినా అంజన్ కుమార్ యాదవ్ అనుచరులు మాత్రం శాంతించలేదు. ఒకానొకదశలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పదే పదే శాంతించాలని కార్యకర్తలను కోరారు. ఈ సమయంలో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ లేచి సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి వచ్చే ఎన్నికల్లో అంజన్ కుమార్ యాదవ్ మాత్రమే పోటీ చేస్తారని ప్రకటించారు.

గ్రేటర్ పరిధిలోని అన్ని సీట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు ఓటమి పాలైనప్పటికీ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసిన అంజన్ కుమార్ యాదవ్ కు అత్యధిక ఓట్లు వచ్చిన విషయాన్ని సర్వే సత్యనారాయణ గుర్తు చేశారు.

హైద్రాబాద్‌ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలని అజారుద్దీన్ కు అంజన్ కుమార్ యాదవ్ అనుచరులు సవాల్ విసిరారు. పదే పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, సర్వే సత్యనారాయణ కోరిన మీదట అంజన్ కుమార్ అనుచరులు శాంతించారు.