కోమటిరెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం నుండి పిలుపు:నేడు న్యూఢిల్లీకి రాజగోపాల్ రెడ్డి


కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ నాయకత్వం నుండి పిలుపు వచ్చింది.  దీంతో ఇవాళ ఆయన  న్యూఢీల్లీకి వెళ్లనున్నారు.

Former MLA Komatireddy Rajagopal Reddy To Leave  New Delhi  For meet Congress Leadership lns


హైదరాబాద్: బీజేపీకి రాజీనామా చేసిన  మాజీ ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  ఫోన్ చేసింది. ఢిల్లీకి రావాలని కోరింది.  కాంగ్రెస్ నాయకత్వం పిలుపు మేరకు  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గురువారంనాడు ఢిల్లీ వెళ్లనున్నారు.  మరో వైపు మాజీ ఎమ్మెల్యే  కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డిని కూడ  కాంగ్రెస్ నాయకత్వం ఢిల్లీకి రావాలని ఆదేశించింది.

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  బీజేపీకి  ఈ నెల  25న రాజీనామా చేశారు. కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు కాంగ్రెస్ లో చేరనున్నట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ నాయకత్వం  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి  టిక్కెట్టు విషయంలో హామీ ఇచ్చింది.  అయితే  మునుగోడు, గజ్వేల్ అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు.

కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేశారు. ఇవాళ ఢిల్లీకి రావాలని కోరారు. కుదిరితే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళే కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. సాధ్యం కాకపోతే  రేపు ఆయన  కాంగ్రెస్ లో చేరనున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు  ఇవాళ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో  కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను ఖరారు చేయనున్నారు.నిన్న కూడ కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ  సమావేశం జరిగింది.  నిన్నటి సమావేశంలో  40 మంది అభ్యర్థులను  ఖరారు చేశారు.  లెఫ్ట్ పార్టీలతో  పొత్తు, ఇతర పార్టీల నుండి వలసలు వచ్చే నేతలపై  చర్చించనున్నారు.

also read:మునుగోడు నుంచే బరిలోకి .. హైకమాండ్ చెబితే కేసీఆర్‌పైనా పోటీ , రేవంత్‌తో ఆ విషయంలోనే గొడవ : రాజగోపాల్ రెడ్డి

ఈ నెల  15వ తేదీన కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది.  రెండో జాబితాపై  కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తుంది. అయితే  ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉన్నందున  అభ్యర్థుల జాబితాపై  కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జనలు  చేస్తుంది.  మరో వైపు  కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు  బరిలో ఉన్న స్థానాల్లో  కాంగ్రెస్ సీనియర్లను బరిలోకి దింపాలని ఆ పార్టీ భావిస్తుంది.

మునుగోడుతో పాటు గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాలని కాంగ్రెస్ నాయకత్వాన్ని  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరారు. ఈ విషయమై పార్టీ నాయకత్వం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో చర్చించనుంది. మరో వైపు మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ ను కూడ  కాంగ్రెస్ నాయకత్వం  న్యూఢీల్లీకి రావాలని కోరింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios