బీజేపీకి గుడ్‌బై: కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ ఠాక్రే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీ సభ్యత్వం అందించారు.
హైదరాబాద్:మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిీ సమావేశానికి ముందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీర్థం పుచ్చుకున్నారు.
గురువారంనాడు రాత్రే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజగోపాల్ రెడ్డికి పార్టీ సభ్యత్వం అందించారు ఠాక్రే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ కూడ కాంగ్రెస్ లో చేరారు.
ఈ నెల 25న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నిన్ననే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి న్యూఢిల్లీకి చేరుకున్నారు. నిన్న మధ్యాహ్నం కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమావేశమయ్యారు. మునుగోడుతో పాటు గజ్వేల్ అసెంబ్లీ స్థానాల్లో పోటీపై కేసీ వేణుగోపాల్ తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చర్చించారు.
2022 ఆగస్టు మాసంలో కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. 2022 అక్టోబర్ మాసంలో జరిగిన మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. బీజేపీలో చోటు చేసుకున్న పరిణామాలతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారు. రెండు రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేశారు.
also read:కేసీ వేణుగోపాల్ తో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ: గజ్వేల్‌లో పోటీపై చర్చ
మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరే సమయంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడ బీజేపీలో చేరారు. బీజేపీలో పరిణామాలపై ఏనుగు రవీందర్ రెడ్డి కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్నారు.గతంలోనే ఆయన కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లారు. మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.