కరీంనగర్:ఈటల రాజేందర్ బిజెపి లో వస్తే మరో ఉప్పెన తప్పదని మాజీ మంత్రి పెద్దిరెడ్డి తేల్చి చెప్పారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడంపై ఆయన తొలిసారిగా స్పందించారు. తనను  సంప్రదించకుండా ఈటెల రాజేందర్ ను  ఎలా బీజేపీ లోకి తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. ఒక్క వర్గం వ్యక్తులు మాత్రమే ఈటలకు మద్దతుగా మాట్లాడుతున్నారన్నారు. 

also read:బీజేపీలోకి ఈటల: మాజీ మంత్రి పెద్దిరెడ్డి అసంతృప్తి

ఈటలతో సంప్రదింపులు జరిపిన సమయంలో ఒక్కసారి కూడా తనను అడగకపోవడం దారుణమన్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానాల్లో వచ్చిన నాయకులు ఈటల విషయాన్ని తనతో  చెప్పడానికి ఏమిటీ బాధ అని ఆయన ప్రశ్నించారు.హైదరాబాద్ లోని వివేక్ ఫామ్ హౌస్ లో చర్చలు జరిపితే కూడా తాను గుర్తు లేదా అని ఆయన ప్రశ్నించారు. తనను  కాదని ఈటలను  పార్టీలోకి ఎలా తీసుకుంటారని ఆయన అడిగారు.  స్థానిక నేతగా ఉన్న తనను  అయిన నన్ను సంప్రదించకుండా  ఈటల రాజేందర్ ను బీజేపీలోకి ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు తాను కేసీఆర్ 25 ఏళ్లు కలిసి పనిచేసినట్టుగా ఆయన చెప్పారు. హుజూరాబాద్ లో  టీఆర్ఎస్ కు బలమైన కేడర్ ఉందన్నారు. టీఆర్ఎస్ కు తన అవసరం లేదనుకొంటున్నానని ఆయన చెప్పారు. 

కడుపులో కత్తులు పెట్టుకొని తియ్యగా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. బీజేపీలో చేరిన నేతలంతా చాలా మంది అసంతృప్తితో ఉన్నారన్నారు. హుజూరాబాద్ని యోజకవర్గం నుండి పోటీ చేసే ఆలోచన తనకు ఉందన్నారు. బీజేపీ నేతలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజలు అభిప్రాయం మేరకు  హుజూరాబాద్ లో అవసరమైతే తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఆయన చెప్పారు. 

రెండు మూడు రోజులుగా బీజేపీ రాష్ట్ర నేతలు ఈటల రాజేందర్ తో మంతనాలు జరుపుతున్నారు. కేంద్ర నాయకత్వం కూడ రాజేందర్ బీజేపీలో చేరికకు సానుకూలంగా స్పందించినట్టుగా ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో పెద్దిరెడ్డి ఈ ప్రకటన చేయడం చర్చకు దారితీసింది. బీజేపీలో చేరే విషయమై ఈటల రాజేందర్ తన అనుచరులతో రెండు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.