Asianet News TeluguAsianet News Telugu

బీజేపీలోకి ఈటల: మాజీ మంత్రి పెద్దిరెడ్డి అసంతృప్తి

మాజీ మంత్రి బీజేపీలో చేరికకు కేంద్ర నాయకత్వం కూడ సానుకూలంగా స్పందించినట్టుగా ప్రచారం సాగుతున్న తరుణంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాత్రం పార్టీ నాయకత్వం చర్యపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
 

former minister Peddi Reddy dissatisfy on Etela Rajender likely to join in Bjp
Author
Karimnagar, First Published May 27, 2021, 4:22 PM IST

కరీంనగర్: మాజీ మంత్రి బీజేపీలో చేరికకు కేంద్ర నాయకత్వం కూడ సానుకూలంగా స్పందించినట్టుగా ప్రచారం సాగుతున్న తరుణంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాత్రం పార్టీ నాయకత్వం చర్యపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.భూకబ్జా ఆరోపణల నేపథ్యంలో  మంత్రివర్గం నుండి ఈటల రాజేందర్ ను  కేసీఆర్ తప్పించారు. దీంతో ఈటల రాజేందర్ బీజేపీ లో చేరే విషయమై  ఆ పార్టీకి చెందిన రాష్ట్ర నాయకత్వంతో చర్చించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర నాయకత్వంతో చర్చించారు. 

also read:ఈటల బీజేపీలోకి వస్తే , ఢిల్లీ పెద్దలకు... రాష్ట్ర నేతలకు బండి సంజయ్ వివరణ

పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి చెందిన ఫామ్‌ హౌస్ లో ఈటల రాజేందర్ బీజేపీ నేతలతో చర్చించారని  సమాచారం.బీజేపీలో చేరే విషయమై ఈటల రాజేందర్ తన అనుచరులతో  చర్చిస్తున్నారు. నిన్న, ఇవాళ కూడ అనుచరులతో ఈటల రాజేందర్ చర్చిస్తున్నారు.రాజేందర్ బీజేపీలో చేరిక విషయమై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని కమలనాథులు చెబుతున్నారు. 

ఈటల రాజేందర్ బీజేపీలో చేరికను మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  హుజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి  పెద్దిరెడ్డి ప్రాతినిథ్యం వహించాడు. టీడీపీ నుండి ఈ స్థానం నుండి ఆయన గెలుపొందాడు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో  పెద్దిరెడ్డి కార్మిక శాఖ మంత్రిగా కూడ కొనసాగారు. కొంత కాలం క్రితం పెద్దిరెడ్డి టీడీపీని వీడి  బీజేపీలో చేరారు.అవశేష టీడీపీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు కొనసాగిన కాలంలో పెద్దిరెడ్డి టీటీడీ సభ్యుడిగా కూడ పనిచేశారు.

హూజూరాబాద్ అసెంబ్లీ స్థానం నుండి రానున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు పెద్దిరెడ్డి సన్నాహలు చేసుకొంటున్నారు. అయితే ఈ సమయంలో ఈటల రాజేందర్ బీజేపీలో చేరితే తనకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని పెద్దిరెడ్డి భావిస్తున్నాడు. మరోవైపు ఈటల రాజేందర్ తో  చర్చించే సమయంలో  కనీసం తనకు సమాచారం  ఇవ్వకపోవడంపై కూడ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరితే మరో ఉప్పెన తప్పదని పెద్దిరెడ్డి హెచ్చరించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios