Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌ను టచ్ చేస్తే మాడి మసైపోతారు: బండి సంజయ్‌కి మోత్కుపల్లి వార్నింగ్

కేసీఆర్ ను టచ్ చేస్తే మాడి మసైపోతారని  టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు వార్నింగ్ ఇచ్చారు. దళిత బంధు పథకం కొనసాగించాలా వద్దా అనే విషయాన్ని సంజయ్ తేల్చి చెప్పాలన్నారు. దళితుల వ్యతిరేకంగా బీజేపీ వ్యవహరిస్తోందన్నారు.

Former Minister Motkupalli Narasimhulu Serious Comments On Bandi Sanjay
Author
Hyderabad, First Published Nov 10, 2021, 11:37 AM IST

 హైదరాబాద్: కేసీఆర్ ను టచ్ చేస్తే మాడి మసైపోతారని మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు బీజేపీ నేతలను హెచ్చరించారు.బుధవారం నాడు మాజీ మంత్రి  మోత్కుపల్లి నర్సింహులు మీడియాతో మాట్లాడారు. మూడు రోజులుగా బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ పై చేస్తున్న విమర్శలకు నర్సింహులు స్పందించారు.దేశంలోని 28 రాష్ట్రాల్లో ఎక్కడైనా దళిత బంధు లాంటి పథకం ఉందా అని ప్రశ్నించారు. దళిత బంధు పథకం ఉండాలనుకొంటున్నారా వద్దనుకొంటున్నారో చెప్పాలని ఆయన  బండి సంజయ్ ను కోరారు. ఓట్ల కోసం బీజేపీ గారడీలు చేస్తోందని ఆయన విమర్శించారు. బీజేపీ చర్యలను దళితుడిగా తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. 70 ఏళ్లలో దళితులకు న్యాయం జరగలేదని  నర్సింహులు చెప్పారు. 

తెలంగాణ సీఎం కేసీఆర్ అంబేద్కర్ ఆలోచలను అమలు చేస్తున్నాడని motkupalli narasimhulu  ప్రశంసించారు. కుల వ్యవస్థను నిర్మూలించేందుకు Kcr నడుం కట్టారని ఆయన చెప్పారు.Dalitha Bandhu పథకం ద్వారా రూ. 10 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి దళితుల అభివృద్ది కోసం ప్రయత్నాలు చేస్తోంటే ఎందుకు అడ్డుకొంటున్నారని బీజేపీని ప్రశ్నించారు. దళిత బంధు అమలైతే దళితులంతా టీఆర్ఎస్ వెంటే ఉంటారని బీజేపీ నేతలకు భయం పట్టుకుందని నర్సింహులు చెప్పారు. 

also read:ఆరు కాదు.. నా తల 10 ముక్కలు నరుకు, డేట్ చెబితే.. ప్రగతిభవన్‌కే వస్తా : కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్

Bandi Sanjay నీకు సిగ్గుందా దళితుల వెంట ఎందుకు పడ్డావ్ అంటూ నర్సింహులు తీవ్ర పదజాలం ఉపయోగించారు. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాల్లో రూ. 15 లక్షలు జమ చేస్తానని చెప్పిన మోడీ ఇంతవరకు ఆ నిధులను ఎందుకు జమ చేయలేదని నర్సింహులు ప్రశ్నించారు. కుల వ్యవస్థను బీజేపీ పెంచిపోషిస్తోందని నర్సింహులు  విమర్శించారు. దేశంలోని రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని  Narendra Modi సర్కార్ ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని నర్సింహులుయ బీజేపీ నేతలను ప్రశ్నించారు. 

ఎల్ఐసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కార్ ప్రైవేట్ పరం చేస్తూ ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే ప్రయత్నాలు చేస్తోందని నర్సింహులు విమర్శించారు. ప్రతి రోజూ డీజీల్, పెట్రోల్ ధరలను పెంచుతారా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీకి   దళితులపై ప్రేమ ఉంటే దేశమంతటా దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తాము అధికారంలోకి వస్తే అచ్చేదిన్ వస్తోందని బీజేపీ నేతలు ప్రకటించారని... మోడీ పాలనలో అచ్చేదిన్ ఎప్పుడు వస్తోందో తెలియదు కానీ సచ్చేదిన్ మాత్రం వచ్చిందని నర్సింహులు సెటైర్లు వేశారు.

హుజురాబాద్ లో ఈటెల గెలుపు కాదు ...వాపేనని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గంపగుత్తగా బీజేపీకి ఓట్లు వేయించడంతోనే ఈటెల  రాజేందర్ గెలిచాడన్నారు. పార్టీనే అమ్ముకున్న వ్యక్తి  రేవంత్ రెడ్డి అని ఆయన విమర్శించారు.కాంగ్రెస్ ఓట్లను ఈటెల కొనుగోలు చేశాడని నర్సింహులు చెప్పారు. ఈటెల రాజేందర్  గెలుపులో నీతి ఉందా? అని ఆయన ప్రశ్నించారు.దళితులభూములు- ఆలయ భూములు తన దగ్గర ఉన్నట్లు ఈటెల రాజేందర్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

బీజేపీ కి వ్యతిరేకంగా డప్పుల దండోరా ఊరూరా వేస్తామన్నారు. బండి సంజయ్ డప్పు ఇక్కడ కాదు  ఢిల్లీలో కొట్టాలన్నారు.దళితబంధు దేశం అంతా అమలు అయ్యే వరకు టీఆర‌్ఎస్ వెంటాడుతుందని చెప్పారు.కేసీఆర్ కు దళితులంతా అండగా ఉంటామన్నారు. దళితుల గురించి మాట్లాడే అర్హత బీజేపీ కి లేదన్నారు. రాజకీయం కోసం కాదు తాను మాట్లాడడం లేదన్నారు. తన జాతి రక్షణ కోసం మాట్లాడుతున్నానని చెప్పారు.

కేసీఆర్ సహకారం లేకుండా  దేశంలో బీజేపీ పాలన చేయలేదన్నారు. దేశంలో రాక్షస పాలన జరుగుతోందన్నారు.కేంద్రమంత్రులు పేదలను తొక్కి సంపుతున్నారన్నారు.దేశాన్ని బండి సంజయ్ ఒక్కడే కాపాడినట్లు పోజు కొడుతున్నారని నర్సింహులు విమర్శించారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios