ఆరు కాదు.. నా తల 10 ముక్కలు నరుకు, డేట్ చెబితే.. ప్రగతిభవన్‌కే వస్తా : కేసీఆర్‌కు బండి సంజయ్ సవాల్
తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తన తల నరికిన పర్వాలేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ డేట్ చెప్తే ప్రగతి భవన్ కు వచ్చి తెలంగాణ ప్రజల కోసం తల నరికించి కుంటా అని సవాల్ విసిరారు. తనను నా కొడకా అని బూతులు తిట్టడానికి, నన్ను నరుకుతా అనడానికి సీఎం అయ్యావా అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. తనను ఆరు ముక్కలు చేస్తానని చెబుతున్నాడని.. అందులోనూ లక్కీ నెంబర్ 6నే చూసుకున్నాడని ఆయన తెలిపారు.
దళితబంధును (dalitha bandhu) రాష్ట్రమంతా అమలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ (bjp) అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) . కేసీఆర్ (kcr) డిప్రేషన్‌లో వున్నారని ఆయన దుయ్యబట్టారు. దళితుడు సీఎం అయ్యే అర్హత లేదా.. అని బండి సంజయ్ ప్రశ్నించారు. ఈ ఏడు సంవత్సరాలలో ధాన్యం (paddy) కొనుగోలు చేసింది ఎవరని ఆయన నిలదీశారు. 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి కేంద్రం తెలంగాణకు లేఖ ఇచ్చిందని బండి సంజయ్ స్పష్టం చేశారు. రాష్ట్రం మొత్తం ధాన్యాన్ని రోడ్లపై పోసిన రైతులు ఎప్పుడు కొంటారా అని ఎదురుచూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్ల మీద, కొనుగోలు కేంద్రాల వద్ద స్థలం లేఖ ఇళ్ల వద్ద ధాన్యాన్ని పోసుకుంటూ ఇబ్బందులు పడుతున్నారని ఆయన చెప్పారు. వాతావరణ శాఖ వర్షం పడుతుందని చెబుతుంటే రైతుల గుండెల్లో దడపుడుతోందన్నారు. రైతుల దృష్టి మళ్లించడానికే కేంద్రం మీద నేరం నేడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. 24 రాష్ట్రాలు పెట్రోల్‌పై (petrol diesel price) వ్యాట్ తగ్గించాయని.. కేసీఆర్ తగ్గాస్తారా లేదా అని ఆయన ప్రశ్నించారు. డప్పుల మోత ఆగదని బండి సంజయ్ స్పష్టం చేశారు. హుజురాబాద్‌లో (huzurabad bypoll) 17 వేల మంది దళితులు నగదు విత్ డ్రా చేసుకునేలా కేసీఆర్ ఆదేశాలు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Also Read:నా ఫాంహౌస్ లో అడుగుపెడితే ఆరు ముక్కలవుతావు: బండి సంజయ్ పై కేసీఆర్ ఫైర్
కేసీఆర్ గద్దె దిగాల్సిందేనని.. దళితుడిని సీఎం చేయాల్సిందేనన్నారు. తనను నా కొడకా అని బూతులు తిట్టడానికి, నన్ను నరుకుతా అనడానికి సీఎం అయ్యావా అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. తనను ఆరు ముక్కలు చేస్తానని చెబుతున్నాడని.. అందులోనూ లక్కీ నెంబర్ 6నే చూసుకున్నాడని ఆయన తెలిపారు. చివరికి నీకు మిగిలేది ఆరుగురు ఎమ్మెల్యేనని బండి సంజయ్ జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం తన తల నరికిన పర్వాలేదని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ డేట్ చెప్తే ప్రగతి భవన్ కు వచ్చి తెలంగాణ ప్రజల కోసం తల నరికించి కుంటా అని సవాల్ విసిరారు.