ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగలు రేవంత్, చంద్రబాబు: మోత్కుపల్లి

First Published 13, Jun 2018, 1:27 PM IST
former minister Mothkupalli fires on Chandrababunaidu
Highlights

బాబుపై మోత్కుపల్లి హట్ కామెంట్స్


హైదరాబాద్: 2019 ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ప్రజలే బుద్ది చెబుతారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అభిప్రాయపడ్డారు.ఏపీని అవినీతిలో నెంబర్ గా చంద్రబాబునాయుడు నిలిపారని ఆయన ఆరోపించారు. తిరుమల కొండెక్కి బాబు ఓడిపోవాలని స్వామివారిని మొక్కుకొంటానని ఆయన చెప్పారు.

టిడిపి నుండి  బహిష్కరణకు గురైన మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బుధవారం నాడు  భువనగిరిలో ఆయన మీడియాతో మాట్లాడారు.  చంద్రబాబుపై విమర్శలు గుప్పించినందుకు గాను నర్సింహులుపై గత నెల 28వ తేదిన టిడిపి వేటు వేసింది. ఈ వేటు తర్వాత ఆయన తొలిసారిగా ఆలేరు నియోజకవర్గంలో తన అనుచరులతో బుధవారం నాడు సమావేశం కానున్నారు.

చంద్రబాబునాయుడు నడిపేది దుర్మార్గపు టిడిపి అని  నర్సింహులు విమర్శించారు.  ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డిలు దొరికిన దొంగలని ఆయన చెప్పారు. రేవంత్ పై బాబు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. 

నందమూరి కుటుంబానికి టిడిపిని అప్పగించాలని మోత్కుపల్లి నర్సింహులు డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ పోరాటం చేస్తున్నారని ఆయన చెప్పారు.రాజకీయ వ్యవస్థలో చంద్రబాబునాయుడు చీడపురుగులాంటి వాడన్నారు.చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో ఓటమి పాలు కావాలని తిరుమల కొండెక్కి కోరుకొంటానని ఆయన చెప్పారు.
 

loader