వీరుడు కన్నీళ్లు పెట్టుకోడు: రేవంత్ రెడ్డికి ఈటల కౌంటర్
నిన్న భాగ్యలక్ష్మి ఆలయం వద్ద రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. తనపై రేవంత్ రెడ్డి ఆరోపణలను ఈటల రాజేందర్ కౌంటరిచ్చారు.
హైదరాబాద్: వీరుడు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోడని మాజీ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. సీఎం కావాలనే ఆశలు అడియాసలు అయినందునే రేవంత్ కన్నీళ్లు పెట్టుకొన్నారని ఆయన ఎద్దేవా చేశారు.
శనివారంనాడు భాగ్యలక్ష్మి ఆలయం వద్ద టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై ఈటల రాజేందర్ స్పందించారు. ఆదివారంనాడు బీజేపీ కార్యాలయంలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. నిన్న మీడియా సమావేశంలో తాను ఏ రాజకీయ నేత గురించి మాట్లాడలేదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తాను రేవంత్ రెడ్డి పేరే ప్రస్తావించలేదన్నారు. కానీ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకుంటూ తన గురించి అసభ్యంగా మాట్లాడారని ఈటల రాజేందర్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో తాను నిత్యం ఉద్యమం చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. కానీ ఆ సమయంలో రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకొని తిరిగాడని ఈటల రాజేందర్ గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డికి తనకు పోలిక ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు పోయి వచ్చాడన్నారు. తాను విద్యార్ధిగా ఉన్న సమయంలోనే జైలుకు వెళ్లివచ్చినట్టుగా ఈటల రాజేందర్ గుర్తు చేశారు. విద్యార్ధి సమస్యలపై తాను పోరాటాలు చేసినట్టుగా ఈటల రాజేందర్ చెప్పారు. ప్రజలకోసం పోరాడి రేవత్ రెడ్డి జైలుకు వెళ్లలేదన్నారు..
పార్లమెంట్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ లు కలిసి పోరాటం చేశాయన్నారు. ఎఐసీసీ అధ్యక్షుడు మల్లకార్జున ఖర్గే ఇంటర్వ్యూ ను ఈటల రాజేందర్ మీడియా సమావేశంలో ప్రస్తావించారు. టీఎంసీ, బీజేపీ,బీఆర్ఎస్ తో చర్చలు జరుపుతున్నామని ఖర్గే రాజ్‌దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూనుమ ఈటల రాజేందర్ మీడియా సమావేశంలో చూపారు.బీజేపీని ఇరకాటంలో పెట్టేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని ఈటల రాజేందర్ విమర్శించారు.
also read:అమ్మవారి మీద ఒట్టు.. కేసీఆర్ నుంచి ఒక్క రూపాయి తీసుకున్నా నాశనమైపోతా : రేవంత్ రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ రూ. 25 కోట్ల ఆర్ధిక సహాయం అందించిందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. రేవంత్ రెడ్డి ఆరోపణలపై ఈటల రాజేంందర్ స్పందించారు.