వరదలను చూసి మంత్రులు చేతులెత్తేశారు: కేసీఆర్ సర్కార్ పై డీకే అరుణ

భారీ వర్షాల కారణంగా  నెలకొన్న వరదలతో  మంత్రులు చేతులేత్తేశారని బీజేపీ నేత డీకే అరుణ  విమర్శించారు.

Former  Minister  DK Aruna  Comments On KCR  Over  heavy Rains in Telangana lns

హైదరాబాద్: వరదలను చూసి మంత్రులు  ముందే చేతులెత్తేశారని  బీజేపీ నేత, మాజీ మంత్రి  డీకే అరుణ విమర్శించారు.శుక్రవారంనాడు హైద్రాబాద్ బీజేపీ కార్యాలయంలో  మాజీ మంత్రి డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా  గ్రేటర్ వరంగల్ లో  150కాలనీలు మునిగిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధమౌతుందన్నారు. 
నీళ్లలోనే వరంగల్ లో  ఉందా అనే అనుమానం కలుగుతుందన్నారు.  భారీ వర్షాల కారణంగా  ఏర్పడిన వరదల విషయమై
కేసీఆర్ సర్కార్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదని ఆమె విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే  ఈ పరిస్థితి నెలకొందన్నారు.వరంగల్ గురించి గొప్పగా మాట్లాడిన కేసీఆర్,కేటీఆర్  ఇప్పుడు ఏం చెబుతారని ఆమె  ప్రశ్నించారు.  హైద్రాబాద్ ను  డల్లాస్, ఇస్తాంబుల్  చేస్తామని కేసీఆర్ సర్కార్ ప్రకటనలను ఆమె గుర్తు  చేశారు. హైద్రాబాద్ లోని చాలా ప్రాంతాల్లో  కూడ  వరద నీరు నిలిచిపోయిందని ఆమె  చెప్పారు.

also read:వరద సహాయక చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలి: కేసీఆర్ సర్కార్ కు తెలంగాణ హైకోర్టు ఆదేశం

జీహెచ్ఎంసీ  ఎన్నికలు ఉన్నందున  గతంలో  హైద్రాబాద్ లో వరదలు వస్తే  రూ. 10 వేల ఆర్ధిక సహాయం ఇచ్చారని ఆమె విమర్శించారు.
వరదల కారణంగా  నష్టపోయిన కుటుంబాలు కోలుకోవడానికి  చాలా సమయం పడుతుందని  డీకే అరుణ చెప్పారు.ప్రకృతి వైపరీత్యాలు వచ్చిన సమయంలో  ప్రభుత్వం బాసటగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.వరద ప్రభావిత పరిస్థితులపై  సమీక్ష నిర్వహించి వారికి సహాయం చేయాలని  ఆమె సీఎం ను కోరారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios