Asianet News TeluguAsianet News Telugu

వరద సహాయక చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలి: కేసీఆర్ సర్కార్ కు తెలంగాణ హైకోర్టు ఆదేశం

వరద సహాయక చర్యలపై  తీసుకున్న నివేదిక ఇవ్వాలని  తెలంగాణ హైకోర్టు  తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Telangana High Court  Orders  To Telangana Government  Detail Report  on  Flood  Assistance lns
Author
First Published Jul 28, 2023, 4:27 PM IST

హైదరాబాద్:  వరద సహాయక చర్యలపై నివేదిక ఇవ్వాలని  తెలంగాణ హైకోర్టు ఆదేశించారు.శుక్రవారంనాడు తెలంగాణ హైకోర్టులో  భారీవర్షాలపై దాఖలైన పిటిషన్ పై  హైకోర్టు విచారణ నిర్వహించింది.వరద ప్రాంతాల్లో ఏం చర్యలు చేపట్టారో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. వరదల్లో ఎందరు మరణించారు, బాధితులకు పరిహారం చెల్లించారా? ముంపు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు  తరలించారా? అని హైకోర్టు  ప్రశ్నించింది.పునరావాస కేంద్రాల్లో ఎలాంటి సదుపాయాలు కల్పించారు? వరదల పర్యవేక్షణ, సహాయం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారా?  అని ప్రశ్నించింది. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారా అని  హైకోర్టు అడిగింది.

ఈ నెల  31వ తేదీలోపుగా  పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.ప్రాజెక్టు పరిసర ప్రజలు భయాందోళనలతో ఉన్నారన్న పిటిషనర్ తరపు న్యాయవాది  హైకోర్టు  దృష్టికి తీసుకు వచ్చారు.అయితే  డ్యామ్ పరిరక్షణ చట్టానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని  హైకోర్టు ఆదేశించింది.తెలంగాణ రాష్ట్రంలో  సుమారు వారం రోజులుగా  వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో  రాష్ట్ర వ్యాప్తంగా  పలు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో  వరద నీటిలోనే  ప్రజలు ఉంటున్నారు.వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు  సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు.  



 

Follow Us:
Download App:
  • android
  • ios