హైదరాబాద్: చివరి దశలో నాయిని నర్సింహ్మారెడ్డికి టీఆర్ఎస్ లో ప్రాధాన్యత ఇవ్వలేదని మాజీ మంత్రి డి.శ్రీనివాస్ ఆరోపించారు.

సోమవారం నాడు మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రి డి. శ్రీనివాస్ పరామర్శించారు. అనారోగ్యంతో నాయిని నర్సింహ్మారెడ్డి అక్టోబర్ 21వ తేదీన రాత్రి మరణించాడు.

అక్టోబర్ 26వ తేదీన నాయిని నర్సింహ్మారెడ్డి భార్య అహల్య కూడ అనారోగ్యంతో మరణించింది. వారం రోజుల వ్యవధిలో నాయిని నర్సింహ్మారెడ్డి ఆయన భార్య మరణించడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

also read:భర్త చనిపోయిన ఐదు రోజులకే: నాయిని నర్సింహా రెడ్డి భార్య కన్నుమూత

నాయిని నర్సింహ్మారెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించిన తర్వాత మాజీ మంత్రి డిఎస్ మీడియాతో మాట్లాడారు. నాయినిని టీఆర్ఎస్ పక్కన పెట్టిందన్నారు. చివరి దశలో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన గుర్తు చేశారు.

నాయిని కుటుంబానికైనా ప్రాధాన్యత ఇవ్వాలని టీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరారు.విద్యార్ధి దశ నుండే తనకు నాయిని మంచి స్నేహితుడని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు.