తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఆర్ఎస్ ను వీడి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెబల్ గా పోటీచేసి ఓడించడానికి విశ్వప్రయత్నాలు చేసిన కరీంనగర్ మాజీ మేయర్ పడన్ గా ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఎదుట ప్రత్యక్షమయ్యాడు. 

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం టీఆర్ఎస్ వర్సెస్ బిజెపి (TRS Vs BJP) గా సాగుతున్నాయి. టీఆర్ఎస్ (trs) ను రాజకీయంగా దెబ్బతీసి అధికారంలోకి రావాలని బిజెపి (bjp) భావిస్తుంటే... అధికారాన్ని తిరిగి నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇరుపార్టీలు ఇప్పటికే రాజకీయ క్రీడలకు తెరతీసాయి. అయితే హిందుత్వ నినాదమే కాదు ప్రభుత్వ వ్యతిరేకత కలిసిరావడంతో బిజెపి తెలంగాణలో బలం పుంజుకుంటున్నా కొన్నిసార్లు సీఎం కేసీఆర్ (kcr) రాజకీయ చాతుర్యం ముందు బోల్తా పడుతోంది. ఇలా తాజాగా మరోసారి బిజెపికి మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (eatala rajender) టీఆర్ఎస్ అధినేత బిగ్ షాక్ ఇచ్చారు.

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ (mlc elections) ఎన్నికల్లో కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ (sardar ravinder singh) టీఆర్ఎస్ సీటు ఆశించి భంగపడిన విషయం తెలిసిందే. కరీంనగర్ లోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ (bhanuprasad), ఇటీవలే పార్టీలో చేరిన ఎల్.రమణ (l ramana)ను పోటీలో నిలిపింది అధికార పార్టీ. దీంతో టీఆర్ఎస్ పార్టీని వీడిన రవీందర్ సింగ్ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఇండిపెండెంట్ గా పోటీలో నిలిచారు. అయితే అతడి 200పైచిలుకు ఓట్లు మాత్రమే వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థులిద్దరూ గెలిచి ఎమ్మెల్సీలుగా మారారు. 

అయితే ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో రవీందర్ సింగ్ ను వెనకుండి నడిపించింది బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అని ప్రచారం జరిగింది. తనకు బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మద్దతిస్తున్నట్లు రవీందర్ బహిరంగంగానే ప్రకటించుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా వుండాలన్న రాష్ట్ర బిజెపి నిర్ణయాన్ని కాదని ఈటల రవీందర్ సింగ్ కు మద్దతివ్వడంపై కాషాయదళంలోనే భిన్నస్వరాలు వినిపించాయి. కానీ అధికార టీఆర్ఎస్ కు మరోసారి ఓటమిరుచి చూపించాలని ఉవ్విళ్లూరిన ఈటల వెనకుండి రవీందర్ సింగ్ ను రంగంలోకి దింపాడు.

read more MLC elections : రవీందర్ సింగ్‌పై కరీంనగర్ మేయర్ సంచలన వ్యాఖ్యలు

కానీ టీఆర్ఎస్ పార్టీ తమ స్థానిక సంస్థల ఓటర్లను క్యాంపులకు తరలించి ఇతరపార్టీలవైపు మొగ్గకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ లోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా రవీందర్ సింగ్ టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పలుమార్లు మాట్లాడారు. తన ఓటమికి ఈటలను బాధ్యుడిని చేయడం తగదని కూడా టీఆర్ఎస్ కు కౌంటరిచ్చారు. అయితే హటాత్తుగా ఏమయ్యిందో తెలీదు కానీ రవీందర్ సింగ్ ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదుట హాజరయ్యారు.

గురువారం సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు వచ్చినట్లు సర్దార్ రవీందర్ సింగ్ తెలిపారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సంస్థలలో నెలకొన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లినట్లు ఆయన తెలిపారు. అలాగే సిక్కు సామాజిక వర్గం 1832 నుండి ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిపారు. ఈ సమస్యలన్నింటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానంటూ సీఎం కేసీర్ సానుకూలంగా స్పందించినట్లు రవీందర్ పేర్కొన్నారు. రానున్న రోజులలో ఈఅన్ని సమస్యలను పరిష్కారం చేసుకుద్దాం అని ముఖ్యమంత్రి కేసీఆ హామి ఇచ్చినట్లు తెలిపారు. 

read more Karimnagar MLC Election 2021: ఎల్. రమణను ఓడించేందుకు మంత్రి గంగుల కుట్ర..: రవీందర్ సింగ్ సంచలనం (Video)

అయితే సర్దార్ రవీందర్ సింగ్ ను సీఎం కేసీఆర్ మళ్లీ దగ్గరకుతీయడం వెనక పెద్ద రాజకీయమే దాగివుందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈటల రాజేందర్ ను దెబ్బతీయడానికే టీఆర్ఎస్ ను వీడటమే కాదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించడానికి ప్రయత్నించిన వ్యక్తిని కూడా కేసీఆర్ దగ్గరకు తీసినట్లు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లాలో ఈటల బలం పెరగకకుండా ముందస్తుగానే ఆయనను టార్గెట్ గా చేసుకుని కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.