తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య తన జన్మదిన వేడుకల్లో కార్యకర్తలతో చిందేసి వారిని ఉత్సాహపరిచారు.

డాక్టర్ గా ప్రజల్లో మంచి పేరుతెచ్చుకొని రాజకీయాల్లో కూడా ఓ స్థాకి చేరుకున్న మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే రాజయ్య జన్మదిన వేడుకలు నిన్న ఆయన నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి.

తన పుట్టిన రోజు వేడుకలను అభిమానుల మధ్య ఆనందోత్సాహాలతో జరుపుకున్న రాజయ్య వారితో కలసి డ్యాన్స్ కూడా చేశారు.

మఖ్యంగా తెలంగాణ పాటలకు కార్యకర్తలతో కలిసి చిందేశారు అమ్మాయిలతోనూ కలసి ఆడిపాడారు.