బీఆర్ఎస్ ఎల్పీ నేతగా మాజీ సీఎం కేసీఆర్..

BRS LP Leader KCR :  బీఆర్ఎస్ ఎల్పీ నేతగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికయ్యారు. ఆ పార్టీ సభ్యులంతా శనివారం ఉదయం సమావేశం అయ్యారు. తమ ఎల్పీ నేతగా కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

Former CM KCR as leader of BRS LP..ISR

BRS LP Leader KCR : తెలంగాణ నూతన అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తన కేబినెట్ లోని మంత్రులకు శాఖలను కేటాయించారు. . కాగా.. హోం మంత్రిత్వ శాఖ, మున్సిపాలిటీ, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ ఆయన వద్దే ఉంచుకున్నారు. మంత్రివర్గ విస్తరణ చేసే సమయంలో వాటిని ఇతరలకు కేటాయించే అవకాశం ఉంది. 

భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ సమావేశాలకు దూరం ?

అయితే బీఆర్ఎస్ కూడా తమ ఎల్పీ నేతను శనివారం ఉదయం ఎన్నుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా శాసన సభా సమావేశాల కంటే ముందే పార్టీ ఆఫీసులో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా మాజీ సీఎం కేసీఆర్ పేరును మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించారు. 

ఈ ప్రతిపాదనను మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి బలపరిచారు. అలాగే శాసనసభాపక్షం మిగతా కమిటీని ఎంపిక చేసే భాద్యతను కేసీఆర్ కు అప్పగించారు. ఈ మేరకు సభ్యులంతా ఏకగీవ్రంగా తీర్మానం చేసి ఆమోదించారు. అనంతరం ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి బయలుదేరి వెళ్లారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios