హైదరాబాద్: హైద్రాబాద్ కు సమీపంలోని ఓ బిస్కెట్ తయారీ యూనిట్ ను గురువారం నాడు మూసివేశారు. బిస్కెట్ తయారీ కంపెనీ నుండి శాంపిల్స్ ను సేకరించారు.హైద్రాబాద్ లోని  బిస్కెట్ కంపెనీకి చెందిన బిస్కెట్లను తిని కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నె గ్రామంలో ముగ్గురు చిన్నారులు మరణించారు.

ఈ నెల 13వ తేదీన కర్నూల్ జిల్లాలో బిస్కెట్లు తిన్న ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. అదే రోజున ఓ చిన్నారి మరణించింది. ఈ నెల 14న, ఒకరు, ఈ నెల 15న మరొకరు మరణించారు. 

also read:కర్నూల్ జిల్లాలో విషాదం: బిస్కెట్లు తిని ఇద్దరు చిన్నారుల మృతి

ఈ ఘటనపై  హైద్రాబాద్ లోని బిస్కెట్ కంపెనీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు. బిస్కెట్ కంపెనీ నుండి శాంపిల్స్ ను తీసుకెళ్లినట్టుగా కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 

చిన్నారులు తిన్న బ్యాచ్ నెంబర్ కు చెందిన బిస్కెట్లను వెనక్కి పంపాలని డీలర్లను కోరినట్టుగా బిస్కెట్ కంపెనీ ప్రతినిధులు ఓ మీడియా ఛానెల్ కు చెప్పారు.ఫుడ్ సెఫ్టీ అధికారులు సేకరించిన శాంపిల్స్ లో ఏం జరిగిందో తేలుతుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.