కర్నూల్:కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డలో బిస్కెట్లు తిన్న ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మృతి చెందినవారు ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

జిల్లాలోని ఆళల్లగడ్డ మండలం చింతకొమ్మదిన్నె గ్రామానికి చెందిన హుసేన్‌బాషా, దిల్‌షాద్ దంపతులకు ఇద్దరు పిల్లలు.  కొడుకు హుసేన్‌బాషా, కూతురు హుసేన్‌బీ .

ఆదివారం నాడు బాబాయి కూతురు జమాల్ బీ తో కలిసి గ్రామంలోని ఓ కిరాణా దుకాణంలో బిస్కెట్లు కొనుగోలు చేశారు. ఇంటి వద్దకు వచ్చి బిస్కెట్లను టీ లో కలుపుకొని తిన్నారు. వెంటనే  చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. 

వెంటనే వారిని ఆళ్లగడ్డలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే హుసేన్ బాషా ప్రాణాలు వదిలాడు. హుసేస్ బబీ, జమాల్ బీ పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కర్నూల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ హుసేన్ బీ సోమవారం నాడు మరణించింది.  పిల్లలు తిన్న బిస్కెట్లు విషతుల్యం కావడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని వైద్యులు అభిప్రాయపడ్డారు. ఈ విషయమై  అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.