Asianet News TeluguAsianet News Telugu

ఆర్డర్ లేట్ గా తెచ్చాడని.. ఫుడ్ డెలివరీ బాయ్ పై విచక్షణారహిత దాడి.. మరుగుతున్న నూనె పడి నలుగురికి తీవ్రగాయాలు

ఫుడ్ డెలివరీ బాయ్ ఆర్డర్ తీసుకురావడంలేట్ అయ్యిందని.. ఓ వ్యక్తి 15మంది అనుచరులతో హోటల్ మీదికి వచ్చాడు. డెలివరీ బాయ్ ను విచక్షణారహితంగా కొట్టాడు. 

food delivery boy attacked indiscriminately as the order delayed in hyderabad
Author
First Published Jan 3, 2023, 6:50 AM IST

హైదరాబాద్ : హైదరాబాద్ లోని హుమాయున్ నగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి ఫుడ్ డెలివరీ బాయ్ మీద వీరంగం సృష్టించాడు. ఆర్డర్ లేటయ్యిందని విరుచుకుపడ్డాడు. అతడి మీద విచక్షణారహితంగా దాడికి దిగాడు. తన బల ప్రయోగం చేశాడు. తన అనుచరులు 15మందిలో హోటల్ దగ్గరికి వచ్చాడు. వారితో కలిసి అక్కడ భయానక వాతావరణం సృష్టించాడు. దీంతో భయపడ్డ ఫుడ్ డెలివరీ బాయ్ హోటల్ లోకి పరుగులు తీశాడు. 

అయినా అతడిని వదిలిపెట్టలేదు. వారు కూడా హోటల్ లోకి దూసుకెళ్లారు. హోటల్ లోపలే అతడిని పట్టుకుని చితకబాదారు. వారి విచక్షణారహిత దాడిలో హోటల్ లో స్టౌమీద ఉన్న మరిగే నూనె మీద పడింది. దీంతో ఫుడ్ డెలివరీ బాయ్ తో పాటు మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ గొడవ సమాచారం తెలిసిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఘటన మీద విచారణ చేపట్టారు.

చికెన్ వింగ్స్ ఆర్డర్ చేస్తే.. ఎముకలు, లెటర్.. దాంట్లో ఉన్న విషయం చూసి కంగుతిన్న కస్టమర్..

ఇదిలా ఉండగా, అక్టోబర్ లో ఇలాంటి ఘటనే న్యూయార్క్ లో కలకలం సృష్టించింది. ఒక్కోసారి క్షణికావేశంలో చేసే పనులు.. తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. జీవితాలను మార్చేస్తాయి. నిందితులుగా జైల్లో పడేలా చేస్తాయి. అలాంటి ఘటనే న్యూయార్క్ లో వెలుగులోకి వచ్చింది. అది దేనికోసం అంటే బిర్యానీ కోసం.. కొన్నిసార్లు రెస్టారెంట్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే..  వేరే వాళ్ళ ఫుడ్డు మనకు సర్వ్ చేయడం లేదా చాలా ఆలస్యంగా తీసుకురావడం.. ఆర్డర్ క్యాన్సిల్ అవ్వడం లాంటివి జరుగుతుంటాయి. ఇవి మామూలుగా జరిగేవే..  అయితే వీటిని సీరియస్గా తీసుకున్నాడు ఓ కస్టమర్.  

తను ఆర్డర్ చేసిన ఫుడ్ రాలేదని అతడికి విపరీతంగా చిర్రెత్తుకొచ్చింది. అంతే ఏకంగా రెస్టారెంట్ నే తగలబెట్టేశాడు. ఈ ఘటన న్యూయార్క్ లో చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 48 ఏళ్ల చోఫెల్ నోర్బు అనే అతను న్యూయార్క్ లోని బంగ్లాదేశ్ రెస్టారెంట్ కి వెళ్లాడు. అక్కడ తనకిష్టమైన చికెన్ బిర్యాని ఆర్డర్ చేశాడు. అయితే, అతను అనుకున్న సమయానికి అది అందలేదు. ఎందుకనో ఆర్డర్ లేట్ అయ్యింది. 

ఎంతో ఆశతో చికెన్ బిర్యానీ తిందామని వస్తే ఇలా లేట్ చేయడంఅతనికి నచ్చలేదు.  దీంతో అతడు కోపంతో ఊగిపోయాడు. రెస్టారెంట్ నుంచి విసవిసా బయటికి వచ్చేశాడు. ఆ తర్వాత ఒక రకమైన మండించే ద్రావణాన్ని బకెట్లో తీసుకువచ్చాడు. దాన్ని ఎవ్వరూ చూడడం లేదని నిర్థారించుకున్నాక ఆ రెస్టారెంట్ పార్కు గార్డెన్ లోకి పోశాడు. ఆ తరువాత నిప్పు పెట్టాడు. అయితే అది ద్రావణం కావడం.. బయటికి కూడా చాలానే పడడంతో అతడు పెట్టిన నిప్పు ఒక్కసారిగా ఎగజిమ్మి అతడికి కూడా మంటలు అంటుకున్నాయి. 

అందుకు సంబంధించిన సంఘటన మొత్తం సిసి టివి ఫుటేజ్ లో రికార్డు అయ్యింది. ప్రమాదం సంగతి గ్రహించిన రెస్టారెంట్ యాజమాన్యం వెంటనే అప్రమత్తం అయ్యింది. మంటలన్ని ఆపి, పోలీసులకు సమాచారం అందించారు. వీరి దర్యాప్తులో భాగంగా సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి.. సదరు నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని అగ్నిమాపక సిబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios