గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం విషమంగా మారిన బాలిక పరిస్థితి
ఉచిత వైద్యం చేయడం పక్కన పెడితే చికిత్స కోసం వచ్చిన వారిని ఉచితంగా చంపేసి విషయంలో గాంధీ ఆస్పత్రి ఎప్పుడో డాక్టరేట్ తీసుకుంది.
గాంధీ ఆస్పత్రి లో ఉద్యోగులు, డాక్టర్ల నిర్లక్ష్యం గురించి చెప్పితే అది మరో రామాయణం అంతా అవుతుంది.
తాజాగా అనారోగ్యంతో గాంధీలో చేరిన ఓ చిన్నారికి పురుగులు పట్టిన సెలైన్ ఎక్కించిన ఇక్కడ సిబ్బంది తమ నిర్లక్ష్యాన్ని మరోమారు ప్రదర్శించారు.
జనగాం జిల్లా మెండ్రాయికి చెందిన సాయి ప్రవళి ఈ నెల 8న గాంధీ ఆసుపత్రిలో చేరంది. జ్వరం, ఆస్తమా ఉండడంతో సిబ్బంది ఆమెకు సెలైన్ బాటిల్ ఎక్కించారు.
అయితే ఆ సెలైన్ బాటిల్‌లో పురుగులు ఉండడం చూసి చిన్నారి తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు. వెంటనే వైద్యులకు సమాచారం ఇచ్చారు. కానీ, అప్పటికే పాప పరిస్థితి విషమంగా మారింది.
విషయం తెలుసుకున్న ప్రవళి బంధువులు గాంధీ ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
