హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో FlyBig విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం 9.45 గంటలకు హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని గొండియాకు బయలుదేరింది. అయితే విమానం రన్ వే‌పైకి రాగానే ఒక్కసారిగా ఆగిపోయింది.

హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో FlyBig విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం 9.45 గంటలకు హైదరాబాద్‌ నుంచి మహారాష్ట్రలోని గొండియాకు బయలుదేరింది. అయితే విమానం రన్ వే‌పైకి రాగానే ఒక్కసారిగా ఆగిపోయింది. విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపంతో ఈ ఘటన చోటుచేసకుంది. దీంతో విమానం రన్‌ వేపైనే నిలిచిపోయింది. విమానం తిరిగి ప్రారంభం కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై మండిపడిన ప్రయాణికులు.. రన్‌ వేపై ధర్నాకు దిగారు. 

ఇది ఇలా ఉంటే.. నేపాల్‌లోని ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ నిర్వహిస్తున్న విమానం ఆచూకీ ఆదివారం గల్లంతైంది. తారా ఎయిర్ 9 NAET ట్విన్-ఇంజిన్ విమానం.. పర్యాటక పట్టణం పోఖారా నుంచి రాజధాని జోమ్‌సోమ్‌కు బయలుదేరింది. టేకాఫ్‌ అయిన విమానం కొద్దిసేపటికే ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. కనిపించకుండా పోయిన విమానంలో నలుగురు భారతీయులతో సహా 22 మంది ఉన్నారు. ‘‘విమానం ముస్తాంగ్ జిల్లాలోని జోమ్సోమ్ గగనతలంలో కనిపించింది. తరువాత మౌంట్ ధౌలగిరికి మళ్లించబడింది, ఆ తర్వాత అది కాంటాక్ట్ కోల్పోయింది’’ అని చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నేత్ర ప్రసాద్ శర్మ చెప్పినట్లు వార్తా సంస్థ ANI పేర్కొంది.

ఆ విమానంలో సిబ్బందితో సహా 22 మంది ప్రయాణికులు ఉన్నారని స్టేట్ టెలివిజన్ తెలిపింది. 22 మందిలో నలుగురు భారతీయులు, ముగ్గురు జపాన్ జాతీయులు, మిగిలిన వారు నేపాలీ పౌరులు ఉన్నారు. విమానాన్ని ట్రేస్ చేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.