గద్వాల జిల్లా అయిజ మండలం కొత్తపల్లిలో ఆదివారం నాడు తెల్లవారుజామున విషాదం చోటు చేసుకొంది. గోడ కూలిన ఘటనలో ఐదుగురు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
గద్వాల: jogulamba gadwal జిల్లా అయిజ మండలం kothapallyలో విషాదం చోటు చేసుకొంది. ఓ ఇంటి గోడకూలి ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఆదివారం నాడు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకొంది. ఒకే ఇంటిలో ఏడుగురు నిద్రిస్తున్న సమయంలో గోడకూలడంతో నిద్రలోనే ఐదుగురు ప్రాణాలు వదిలారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
also read:కోడిగుడ్డు కోసం పోతే.. ప్రాణాలు పోయాయి... !
కొత్తపల్లి గ్రామానికి చెందిన శాంతమ్మ, వారి పిల్లలు తేజ, చరణ్ , రామ్, శాంతమ్మ భర్త మోషలు మరణించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు పిల్లలు స్నేహా, చిన్నాలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరు చిన్నారులను గద్వాల ఆసుపత్రికి తరలించారు.
ఇటీవల కురిసన వర్షాలకు గోడ తడిసి కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్లలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
