ఓ కుటుంబంలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు వ్యక్తులు ఒకరి తర్వాత ఒకరు మరణిస్తుంటే వారిని కన్న తల్లికి ఎంతటి గర్భశోకం. సినిమా కథను తలపించే ఈ విషాదగాధ నిజామాబాద్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఆర్మూర్ పట్టణంలోని శాస్త్రినగర్‌కు చెందిన షేక్ అబ్ధుల్ కరీం, రహీమున్నీసా బేగం దంపతులకు ఏడుగురు కొడుకులు. ఈ క్రమంలో అబ్ధుల్ కరీం 15 ఏళ్ల కిందట అనారోగ్యంతో మరణించారు. దీంతో ఆయన భార్య రహీమున్నీసా ఎంతో కష్టపడి పిల్లలను పెంచి పెద్ద చేసింది.

Also Read:‘టీ అమ్మనీకి పోయినా’’.. నేను ఉండుంటే దిశపై దారుణం జరిగేది కాదు

ఈ క్రమంలో 2011లో కుమారుడు షేక్ ఇర్ఫాన్ అనారోగ్యంతో మరణించాడు. ఈ విషాదం నుంచి తేరుకోకుండానే ఏడాది తిరక్కుండానే 2013లో పెద్ద కుమారుడు షేక్ బాబా కూడా అనారోగ్యంతో మరణించాడు. 2015లో నాలుగో కుమారుడు షేక్ మోబిన్ గూండ్ల చెరువులో స్నానానికి వెళ్లి.. ఈత రాకపోవడంతో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు.

ఆ తర్వాత 2017లో మూడో కుమారుడు షేక్ అజ్జు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో ఐదో కుమారుడు ముజాహిద్‌ గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు.

Also Read:డెలీవరి సమయంలో శిశువు తల కోసేసిన వైద్యుడు, తల్లి గర్భంలోనే బిడ్డ మొండెం

వీరంతా కూడా ఆటోడ్రైవర్లుగా పనిచేస్తున్న వారే.. దానితో పాటు ఏ ఒక్కరికి పాతికేళ్లు కూడా నిండకపోవడం గమనార్హం. వృద్ధాప్యంలో తనకు తోడుగా ఉంటారనుకున్న కుమారులు ఒక్కొక్కరిగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో రహీమున్నీసా మానసికంగా కుంగిపోతున్నారు. ఇదే సమయంలో మిగిలిన ఇద్దరు కుమారులకు ఏమవుతుందోనని ఆమె ఆందోళన చెందుతున్నారు.