Asianet News TeluguAsianet News Telugu

డెలీవరి సమయంలో శిశువు తల కోసేసిన వైద్యుడు, తల్లి గర్భంలోనే బిడ్డ మొండెం

నాగర్‌కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో ఓ వైద్యుడి అంతులేని నిర్లక్ష్యంతో డెలీవరి సమయంలో శిశువు తల కోసేశాడు. దీంతో తల లేకుండానే శిశువు మృతదేహం తల్లి గర్భంలో ఉండిపోయింది. 

doctor cut baby head during delivery in achampet govt hospital
Author
Achampet, First Published Dec 20, 2019, 3:59 PM IST

నాగర్‌కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో ఓ వైద్యుడి అంతులేని నిర్లక్ష్యంతో డెలీవరి సమయంలో శిశువు తల కోసేశాడు. దీంతో తల లేకుండానే శిశువు మృతదేహం తల్లి గర్భంలో ఉండిపోయింది.

పరిస్ధితి విషమంగా మారడంతో తల్లిని హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. శిశువు గర్భంలోనే చనిపోవడంతో తల్లి పరిస్ధితి ఆందోళనకరంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

Also Read:వైద్యుల నిర్లక్ష్యం.. తెగిపడిన కడుపులో బిడ్డ తల

డాక్టర్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బాధితురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగడంతో పాటు ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఆసుపత్రి దగ్గర పరిస్ధితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేశారు. 

కొద్దిరోజుల క్రితం కల్పాక్కం సమీపంలోని కడలూరుకు చెందిన బొమ్మి (28)ని బుధవారం ఉదయం ప్రసవం కోసం కూవత్తురు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆ సమయంలో డ్యూటీ డాక్టర్లు లేకపోవడంతో నర్సులే బొమ్మిని పరీక్షించి ప్రసవం చేయడానికి సిద్ధపడ్డారు.

ఆపరేషన్‌ థియేటర్‌లో పురుడు పోస్తున్న సమయంలో గర్భాశయం నుంచి కొద్దిగా బయటకు వచ్చిన శిశువు తలను పట్టుకుని బలంగా లాగారు. దీంతో మొండెం నుంచి తల తెగిపోయి బయటకు వచ్చింది. మిగిలిన దేహం గర్భాశయంలోనే ఉండిపోయింది. భయాందోళనలకు గురైన నర్సులు ఆస్పత్రి వైద్యులకు, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. 

Also Read:నిమ్స్ వైద్యుల నిర్లక్ష్యం...ఆపరేషన్ చేసి కడుపులోనే కత్తెర మరిచి

శిశువు మొండెం గర్భాశయంలోనే ఉండిపోవడంతో బొమ్మి కుటుంబీకులు ఆమెను వెంటనే చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు శస్త్రచికిత్స చేసి శిశువు దేహాన్ని వెలికి తీశారు.

ప్రస్తుతం బొమ్మి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సులు, విధులకు హాజరుకాని వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కుటుంబ సభ్యులు, స్థానికులు ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios