కాంగ్రెస్ బస్సు యాత్రలో డిష్యూం డిష్యూం.. (వీడియో)

First Published 7, Mar 2018, 1:51 PM IST
fist  fight erupts in Congress praja chaitanya bus yatra
Highlights
  • స్వాగతం పలికేది వదిలేసి కొట్టుకున్నారు
  • రెండు వర్గాలపై పిసిసి ఉత్తమ్ ఆగ్రహం

ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ ప్రజాస్వామ్యం కలిగిన రాజకీయ పార్టీగా కాంగ్రెస్ రికార్డు నెలకొల్పింది. ఆ పార్టీలో ఎంత పెద్ద లీడర్ ను అయినా గల్లీ లీడర్ విమర్శిస్తాడు. తిడతాడు. అవసరమైతే దాడులు కూడా చేస్తారు. పెద్ద పెద్ద లీడర్లు తిట్టుకుంటారు. విమర్శించుకుంటారు. చోటా మోటా లీడర్లయితే కొట్టకుంటారు.

తాజాగా జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మండలం లో కాంగ్రెస్ బస్సు యాత్రలో రెండు వర్గాల మధ్య దాడులు, ప్రతిదాడులు జరిగాయి. కర్రలతో ఇరు వర్గాల వారు కొట్టుకున్నారు. ఈ కొట్లాట లో పలువురికి గాయాలయ్యాయి.

కోరుట్లలో బస్సు యాత్రకు స్వాగతం పలికే క్రమంలో కొమిరెడడి రాములు వర్గానికి, జైన్ వెంకట్ వర్గానికి మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో ఇరు వర్గాలు కొట్టుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాల తీరు పై పీసీసీ చిప్ ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లీడర్ల కొట్లాట వీడియో కింద ఉంది చూడండి.

loader