Asianet News TeluguAsianet News Telugu

Fish Prasadam: చేప మందు పంపిణీకి బత్తిని కుటుంబం సిద్ధం.. ఏ రోజుంటే?

Fish Prasadam: ప్రతి సంవత్సరం మృగశిర కార్తె రోజున హైదరాబాద్ కు చెందిన బత్తిన కుటుంబం చేప మందు ప్రసాదం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ ఏడాది కూడా జూన్ 8న చేప ప్రసాదం పంపిణీ చేస్తామని బత్తిని కుటుంబం తెలిపింది.

Fish Prasadam To Be distribution on June 8 krj
Author
First Published May 20, 2024, 10:32 AM IST

Fish Prasadam: తెలంగాణలో మృగశిర కార్తె నాడు చేపలు తినడం అనాదిగా వస్తున్న ఆచారం. ఈ విధంగా మృగశిర కార్తె నాడు చేపలు తినడం వల్ల ఆస్తమా, గుండె జబ్బుల రోగులకు ఉపశమనం దొరుకుతుందని నమ్ముతారు. అలాగే.. ప్రతి ఏడాది మృగశిర కార్తె రోజున హైదరాబాద్ కు చెందిన బత్తిని కుటుంబం వారు చేప మందు ‘ప్రసాదం’ పంపిణీ చేస్తుండటం అనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే.

ఈ ఏడాది కూడా చేప ప్రసాదం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నమని  ప్రసాద పంపిణీదారులు బత్తిన ఫ్యామిలీ ప్రకటన చేసింది. హైదరాబాద్‌‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూన్ 8న చేప మందు ప్రసాదం పంపిణీ చేయనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రసాదం తింటే ఆస్తమా తగ్గుతుందని ప్రజల నమ్మకం.

ఈ ఏడాది జూన్ 8న మృగశిర కార్తె ప్రవేశిస్తోంది. ఆ రోజు చేప ప్రసాదం పంపిణీ చేయబోతున్నట్టు, ఈ కార్యక్రమానికి ప్రభుత్వ అనుమతి లభించిందని, పోలీసులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని కుటుంబ సభ్యులు బత్తిని అనురీత్‌గౌడ్, గౌరీ శంకర్‌ గౌడ్‌లు తెలిపారు. ప్రసాదం తయారీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని తెలిపారు.

చేప ప్రసాదం పంపిణీకి ముందు సత్యనారాయణ వ్రతం, భావిపూజలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రసాదం బతికి ఉన్న చేపలో పెట్టి పంపిణీ చేస్తుంటారు. ఈ చేప ప్రసాదం కోసం కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి సైతం వేల సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో భారీ ఏర్పాటు చేయనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios