హైదరాబాద్ రాజేంద్రనగర్ లో అగ్నిప్రమాదం..స్క్రాప్ గోదాంలో చెలరేగిన మంటలు...
హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్క్రాప్ గోదాంలో మంటలు చెలరేగడంలో ఈ ప్రమాదం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో గురువారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ లోని శివరాంపల్లి దగ్గర ఒక స్క్రాప్ గోడౌన్ లో మంటలు చెలరేగాయి. సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. అగ్నిప్రమాదం కారణంగా దట్టమైన పొగ వ్యాపించడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.